Akhanda-2: అఖండ-2 కొత్త రిలీజ్ డేట్ ఇదే?

సినిమా విడుదల వాయిదా పడడంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Akhanda-2: అఖండ-2 కొత్త రిలీజ్ డేట్ ఇదే?

Akhanda 2

Updated On : December 5, 2025 / 8:25 AM IST

Akhanda-2: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 మూవీ రిలీజ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. కొన్ని పరిస్థితుల కారణంగా ఆ సినిమా రిలీజ్ కావడం లేదంటూ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ గత రాత్రి ప్రకటన చేసింది.

గత రాత్రి ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్‌ షోలకు కూడా ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్థికపర సమస్యలు రావడంతో స్పెషల్‌ షోలు రద్దయ్యాయి. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అప్పటికీ సినిమా రిలీజ్ చేయలేకపోతే ఇక సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. అఖండ-2 మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ తేదీపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.

Also Read: ఈ ఏడాది 53% పెరిగిన బంగారం ధర.. ఇక వచ్చే ఏడాదైతే.. ఇప్పుడుగనుక పసిడి కొంటే..

అఖండ-2 సినిమాలో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటించారు. రామ్ ఆచంట, గోపి ఆచంట, బాలకృష్ణ చిన్నకుమార్తె ఎం.తేజస్విని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన అఖండ సినిమాకు కొనసాగింపుగా అఖండ-2 సినిమా వస్తోంది.