IFFI 2022 : ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో చోటు దక్కించుకున్న అఖండ, RRR, మేజర్..

ఈసారి గోవాలో జరగనున్న ఈ 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 25 సినిమాలను, నాన్‌ – ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 20 సినిమాలను, ఇండియన్‌ పనోరమ సెక్షన్‌ కింద..........

ప్రతి సంవత్సరం గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఇఫీ) ఈ సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది. ఈసారి గోవాలో జరగనున్న ఈ 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 25 సినిమాలను, నాన్‌ – ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 20 సినిమాలను, ఇండియన్‌ పనోరమ సెక్షన్‌ కింద 45 సినిమాలనై సెలెక్ట్ చేసి ప్రదర్శించనున్నారు.

Anu Emmanuel : వేరే ప్రశ్నలేమి అడగరా?? ఎప్పుడూ అవేనా??.. విలేఖరి పై ఫైర్ అయిన అను ఇమ్మాన్యుయేల్..

ఫీచర్ ఫిలిం కేటగిరిలో తెలుగు నుంచి RRR, అఖండ, మేజర్ సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇక పనోరమా సెక్షన్ లో సినిమా బండి. ఖుదీరాం బోస్ సినిమాలు ప్రదర్శించనున్నారు. నాన్ ఫీచర్ ఫిలిం లో తెలుగు నుంచి ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదు. దీంతో ఇఫీలో చోటు దక్కించుకున్న చిత్ర యూనిట్స్ కి అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు