Anu Emmanuel : వేరే ప్రశ్నలేమి అడగరా?? ఎప్పుడూ అవేనా??.. విలేఖరి పై ఫైర్ అయిన అను ఇమ్మాన్యుయేల్..

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతున్నప్పుడు ఓ విలేఖరి.. మేడం మీరు అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా చేశారు. ఇప్పుడు అల్లు శిరీష్ తో 'ఊర్వశివో రాక్షసివో' చేశారు. వీరిద్దరిలో..........

Anu Emmanuel : వేరే ప్రశ్నలేమి అడగరా?? ఎప్పుడూ అవేనా??.. విలేఖరి పై ఫైర్ అయిన అను ఇమ్మాన్యుయేల్..

Anu Emmanuel fires on a journalist

Updated On : October 23, 2022 / 12:02 PM IST

Anu Emmanuel :  ఇటీవల కొంతమంది హీరోయిన్స్ ప్రమోషన్స్ లో విలేఖరులు అడిగే ప్రశ్నలకి అసహనం గురవుతూ సీరియస్ కూడా అవుతున్నారు. తాజాగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఓ విలేకరిపై ఇలాగే సీరియస్ అయింది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండగా ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ఒక్క హీరో.. 2000 కోట్ల పెట్టుబడి.. ఎందుకంత నమ్మకం??

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతున్నప్పుడు ఓ విలేఖరి.. మేడం మీరు అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా చేశారు. ఇప్పుడు అల్లు శిరీష్ తో ‘ఊర్వశివో రాక్షసివో’ చేశారు. వీరిద్దరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటీ అని ప్రశ్నించాడు. దేనికి అను సీరియస్ అయి.. మీకు అడగడానికి వేరే ప్రశ్నలు లేవా? కాస్త మంచి ప్రశ్నలు అడగండి అంటూ అసహనానికి గురయింది. దీంతో అను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.