Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ఒక్క హీరో.. 2000 కోట్ల పెట్టుబడి.. ఎందుకంత నమ్మకం??

బాహుబలి తర్వాత ప్రభాస్ కి జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో భారీగా మార్కెట్ ఏర్పడింది. ఇక సాహో సినిమాతో జపాన్ లో పాతుకుపోయాడు. రాధేశ్యామ్ సినిమాతో...........

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ఒక్క హీరో.. 2000 కోట్ల పెట్టుబడి.. ఎందుకంత నమ్మకం??

Prabhas birthday special story

Prabhas :  రెబల్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారి బాహుబలి సినిమాతో సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారి గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ కి తెలుగులో, మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా అభిమానులు భారీగా ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఏ స్టార్ హీరో కూడా ప్రభాస్ ని అందుకోలేనంతగా ఎదిగాడు.

నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ పేరుతో సెలబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అభిమానులు. బాహుబలి తర్వాత 350 కోట్లతో సాహో సినిమా, 300 కోట్లతో రాధేశ్యామ్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. భారీగానే నష్టం కూడా వచ్చింది. అయినా కూడా ప్రభాస్ మార్కెట్ తగ్గలేదు. ఇప్పుడు రాబోయే అన్ని సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే.

ఇలా వరుసగా రెండు ఫ్లాప్స్ పడితే ఏ స్టార్ హీరో మార్కెట్ అయినా పడిపోతుంది. ఆ హీరో మీద భారీ బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారు. కానీ ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలు ఇంకా ప్రభాస్ మీద పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఎందుకంత నమ్మకం ప్రభాస్ అంటే. బాహుబలి సినిమాతో ఏ హీరో చేయలేని మ్యాజిక్ చేసి ఒక్కసారిగా తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లి, వేరే దేశాల్లో కూడా తనకి మార్కెట్ సృష్టించుకున్నాడు ప్రభాస్. వేరే స్టార్ హీరోల సినిమాలు వేరే దేశాల్లో రిలీజ్ అయినా అక్కడ వారికంటూ సపరేట్ మార్కెట్ అంటూ ఏమి ఉండదు. కానీ ప్రభాస్ సపరేట్ గా తనకంటూ ఓ మార్కెట్ ని సృష్టించుకున్నాడు.

Rishab Shetty : దయచేసి ఆ శబ్దాలని అనుకరించకండి.. కాంతార సినిమా చూసిన వాళ్లకి రిషబ్ శెట్టి విజ్ఞప్తి..

బాహుబలి తర్వాత ప్రభాస్ కి జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో భారీగా మార్కెట్ ఏర్పడింది. ఇక సాహో సినిమాతో జపాన్ లో పాతుకుపోయాడు. రాధేశ్యామ్ సినిమాతో ఆఫ్రికా దేశాల్లో కూడా కొద్దో గొప్పో మార్కెట్ సృష్టించాడు. బాలీవుడ్, నార్త్ ఇండియా మొత్తం ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉంది. దీంతో ప్రభాస్ ని ఒక టాలీవుడ్ హీరోగా కాకుండా వరల్డ్ వైడ్ హీరోగా చూసి నిర్మాతలు డబ్బులు పెడుతున్నారు.

ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా 350 కోట్లతో తెరకెక్కుతుంది. ఈ సినిమా మీద మాత్రం టీజర్ రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటి భారీగా ఏర్పడింది. ఈ సినిమా భారీ హిట్ కొట్టడం కష్టమే అంటున్నారు. ఆ తర్వాత సలార్ 300 కోట్లతో, ప్రాజెక్ట్ K 500 కోట్లతో, మారుతీ సినిమా 100 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత స్పిరిట్ ప్రాజెక్ట్ కూడా ఉంది. దీనికి కూడా భారీ బడ్జెట్ ఉండనుంది. ఇన్ని సినిమాలు ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారంటే కేవలం ప్రభాస్ ని చూసి మాత్రమే. ఒక్క హీరో మీద నమ్మకంతో వేల కోట్లు పెడుతున్నారంటే ప్రభాస్ ఏ రేంజ్ లో ఎదిగాడో మనకే అర్ధమవుతుంది.