Akhil Akkineni: మాల్దీవ్స్‌లో ప్రత్యక్షమైన ఏజెంట్.. దేనికోసమో?

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో....

Akhil Akkineni Lands In Maldives

Akhil Akkineni: యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి తనను తాను మార్చుకున్నాడు. ఇప్పటికే ఏజెంట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమాలో అఖిల్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Akhil Akkineni: వైజాగ్‌లో ఏజెంట్ క్రేజ్ మామూలుగా లేదుగా!

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా అఖిల్ అక్కినేని మాల్దీవుల్లో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆయన అభిమానులు అవాక్కవుతున్నారు. ఏజెంట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటాడనుకున్న అఖిల్, ఇలా మాల్దీవుల్లో ఏం చేస్తున్నాడని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన అఖిల్, ఇలా సమ్మర్ వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడ ఆయన స్విమ్ చేస్తూ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టారు. మాల్దీవులకు వెళ్లినప్పుడల్లో ఇంటికి తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

Akhil Akkineni: ‘ఏజెంట్’ రాకకు డేట్ ఫిక్స్!

ఏజెంట్ సినిమా కోసం బాడీ పెంచేసి బీస్ట్ మోడ్‌లోకి అఖిల్ మారడం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాలో ఆయన్ను చూసేందుకు వారు చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.