Agent Movie : ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అయ్యగారి ‘ఏజెంట్’.. ఎప్పుడు? ఎక్కడ?

ప్రస్తుత కాలంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా థియేటర్స్ లో రిలీజ్ అయిన 30 నుంచి 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అది కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఏజెంట్ సినిమా ఊసే లేదు.

Akhil Akkineni Sakshi Viadya Surendar Reddy Agent Movie OTT Streaming Date and Details Here

Akhil Agent Movie : అఖిల్ అక్కినేని(Akhil Akkineni) మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించిన సినిమా ఏజెంట్. అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజయింది.

భారీ అంచనాలు, ఆశలతో రిలీజయిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక భారీ పరాజయం పాలైంది. సినిమాకి పెట్టిన డబ్బులు రాకపోగా దాదాపు 40 కోట్ల నష్టం వచ్చిందని సమాచారం. నిర్మాత అనిల్ సుంకర కూడా సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకుంటూ స్క్రిప్ట్ రెడీ లేకుండా షూట్ కి వెళ్లడం మాదే తప్పు అని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

ప్రస్తుత కాలంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా థియేటర్స్ లో రిలీజ్ అయిన 30 నుంచి 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అది కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఏజెంట్ సినిమా ఊసే లేదు. సినిమా రిలిజ్ కి ముందే సోనీ లివ్ ఓటీటీ వాళ్ళు ఏజెంట్ రైట్స్ కొన్నారు. కానీ సినిమా డిజాస్టర్ అవ్వడంతో సోనీ రిలీజ్ చేయలేదు.

Also Read : Ram Charan : థ్యాంక్యూ నాన్న.. 45 ఏళ్ళ మెగాస్టార్ సినీ ప్రస్థానం.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..

దీని గురించి ఇన్నాళ్లు నిర్మాతకు, ఓటీటీ సంస్థకు మధ్య చర్చలు జరిగాయని సమాచారం. ఫ్లాప్ సినిమా అయినా ఇంకా ఓటీటీకి రాలేదని ప్రేక్షకులు అనుకుంటే, అఖిల్ అయ్యగారి అభిమానులు మాత్రం సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇన్ని నెలల తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. నిర్మాతలు, ఓటీటీ సంస్థ మధ్య ఒప్పందాలు, చర్చల అనంతరం సోని లివ్ ఓటీటీలో అఖిల్ ఏజెంట్ సినిమా సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని సోని లివ్ అధికారికంగా ప్రకటించింది. మరి ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫలపు అయి ఓటీటీలో హిట్ అవుతున్నాయి. ఏజెంట్ సినిమా కూడా అదే తరహాలో ఓటీటీలో సక్సెస్ అవుతుందేమో చూడాలి.