Akira Nandan : ఎమోషనల్ సాంగ్ ప్లే చేసిన అకిరా.. నాన్న కోసమేనా.. పవన్ తనయుడు ఎప్పటికైనా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సిందే..

అకిరా ప్రస్తుతం అమెరికాలోకిని ఓ ఫిలిం స్కూల్ లో సంగీత పాటలు నేర్చుకుంటున్నాడు. అకిరా భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది.

Akira Nandan Plays emotional father song in Mega Family Bengaluru Sankranthi Celebrations

Akira Nandan : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తనయుడిగా అకిరా నందన్ అందరికి సుపరిచితమే. తండ్రి బాటలో నటనలోకి వచ్చి హీరో అవుతాడని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. అయితే అకిరా హీరో అవ్వడు అని రేణు దేశాయ్ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లింది. కానీ నటించకపోయినా సినీ పరిశ్రమలోనే ఉంటాడని క్లారిటీ కూడా ఇచ్చింది. అకిరా పియానో బాగా ప్లే చేస్తాడని అందరికి తెలుసు. గతంలో ఓ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాడు.

అకిరా ప్రస్తుతం అమెరికాలోకిని ఓ ఫిలిం స్కూల్ లో సంగీత పాటలు నేర్చుకుంటున్నాడు. అకిరా భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది. అయితే అకిరా ఈ సంక్రాంతికి ఇండియా వచ్చాడు. మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు మెగా ఫ్యామిలీ(Mega Family) మెంబర్స్ బెంగుళూరు నుంచి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అక్కడ బెంగుళూరులో రాత్రి పూట అందరూ సరదాగా సేద తీరుతుంటే అకిరా నందన్ తన పియానో మీద పలు సాంగ్ ప్లే చేసి వినిపించాడట. అకిరా పియానో ప్లే చేయడం ఉపాసన వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే వీడియోలో సరిగ్గా మ్యూజిక్ రికార్డు అవ్వలేదని చెప్పి తాను యాడ్ చేసింది. యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణం అనే సాంగ్ ని పియానో మీద అకిరా ప్లే చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్.. సంక్రాంతి స్పెషల్ పార్టీ.. త్రివిక్రమ్ ఎక్కడ?

పవన్ కోసం అకిరా ఈ పాట ప్లే చేశాడు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అకిరా మంచి పియానో ప్లేయర్ అని తెలుసు. ఇప్పుడు అమెరికాలో సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కూడా రేణు దేశాయ్ చెప్పింది. దీంతో అకిరా నందన్ భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అని అభిమానులు భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ పిక్ లో పవన్ కళ్యాణ్ లేడని బాధపడినా ఆ బాధని అకిరా తీరుస్తున్నాడు.