Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్.. సంక్రాంతి స్పెషల్ పార్టీ.. త్రివిక్రమ్ ఎక్కడ?

తాజాగా గుంటూరు కారం సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్.. సంక్రాంతి స్పెషల్ పార్టీ.. త్రివిక్రమ్ ఎక్కడ?

Guntur Kaaram Movie Unit Celebrated Success Party on Sankranthi

Updated On : January 16, 2024 / 7:09 AM IST

Guntur Kaaram Success Celebrations : ఈ సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 175 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది గుంటూరు కారం. ఇంకా కొన్ని రోజులు సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీలు థియేటర్స్ కి వెళ్తున్నారు. గుంటూరు కారం సినిమా సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.

తాజాగా గుంటూరు కారం సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే కేవలం కొంతమంది మాత్రమే ప్రైవేట్ పార్టీలా చేసుకున్నారు. నిన్న సంక్రాంతి కూడా కావడంతో చిత్రయూనిట్ మహేష్ ఇంట్లో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు ఫ్యామిలీ, దిల్ రాజు ఫ్యామిలీ, నాగవంశీ ఫ్యామిలీ, శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. మహేష్, శ్రీలీల, నమ్రత ఈ సక్సెస్ పార్టీ నుంచి ఫోటోలు తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.

Also Read : Sankranti Updates : టాలీవుడ్ మూవీస్ సంక్రాంతి అప్డేట్స్.. ఫెస్టివల్ స్పెషల్ ఫొటోషూట్స్..

అయితే ఈ పార్టీ ఫొటోల్లో త్రివిక్రమ్ లేకపోవడంతో గురూజీ ఎక్కడ అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ లేకుండా పార్టీ చేసేసుకుంటున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ పార్టీకి రాకపోవడం గమనార్హం.