Akkineni Akhil doing his next film in Hombale Films banner. (1)
Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు దాటింది. 5 సినిమాలు చేశాడు అఖిల్. కానీ, ఇప్పటివరకు సరైన హిట్దక్కలేదు. మధ్యలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్పా మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఇక అఖిల్ లాస్ట్ సినిమా ఏజెంట్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా తరువాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు లెనిన్ సినిమా చేస్తున్నాడు. మురళి కిషోర్ అబ్బురు తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే, ఈ లెనిన్ సినిమా తరువాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ టీంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట అఖిల్. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలకు ప్రశాంత్ నీల్ దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట అఖిల్(Akhil Akkineni).
Pranavi Manukonda: అలల మధ్యలో వలపు వయ్యారిలా.. ప్రణవి మానుకొండ గ్లామర్ ట్రీట్.. ఫొటోలు
ఈ కొత్త దర్శకుడు చెప్పిన లైన్ అఖిల్ కి చాలా బాగా నచ్చిందట. అంతేకాదు ప్రశాంత్ నీల్ శిష్యుడు కావడంతో వెంటనే ఒకే చెప్పేశాడట అఖిల్. ప్రశాంత్ నీల్ సినిమాల రేంజ్ లోనే ఈ సినిమా కూడా భారీగా తెరకెక్కనుందట. కమర్షియల్ అంశాలతో పాటు ఒక బలమైన ఎమోషన్ ని ఈ సినిమాలో యాడ్ చేశాడట దర్శకుడు. ఈ సినిమాను కన్నడ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించానుందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందట.
ఇక ఈ న్యూస్ తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లెనిన్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నాడట అఖిల్. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా గనక హిట్ హిట్ అయ్యింది అంటే అఖిల్ మాస్ హీరోల లిస్టు చేరిపోవడం ఖాయం అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి.