Akkineni Akhil : అయ్యగారి నెక్స్ట్ సినిమా అనౌన్స్.. ఈసారి అక్కినేని అఖిల్ హిట్ పక్కా..
తాజాగా నేడు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా అఖిల్ నెక్స్ట్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది.

Akkineni Akhil Next Movie Announced Officially on his Birthday
Akkineni Akhil : అక్కినేని హీరోల్లో అఖిల్ హిట్ ఎప్పుడు కొడతాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. గ్రాండ్ గా అఖిల్ అని భారీ యాక్షన్ సినిమాతో లాంచ్ అయిన అఖిల్ ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో పర్వాలేదనిపించినా ఆశించినంత విజయం సాధించలేదు. అఖిల్ గత సినిమా ఏజెంట్ అయితే దారుణమైన పరాజయం పాలైంది.
Also Read : Odela 2 : తమన్నా ‘ఓదెల 2’ ట్రైలర్ వచ్చేసింది.. ప్రేతాత్మ వర్సెస్ అఘోరా..
దీంతో అఖిల్ ఒక సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఏజెంట్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు. అఖిల్ నెక్స్ట్ సినిమాపై పలు వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన రాలేదు. నేడు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా అఖిల్ నెక్స్ట్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా నాగార్జున చేతుల మీదుగా అఖిల్ నెక్స్ట్ సినిమా లెనిన్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. మీరు కూడా లెనిన్ గ్లింప్స్ చూసేయండి..
ఈ గ్లింప్స్ లో.. మా నాయన నాకో మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా.. పేరు ఉండదు.. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రమే ఉంటది.. అనే మాస్ డైలాగ్ అఖిల్ వాయిస్ తో చెప్పించారు. చివర్లో ఏ యుద్ధం ప్రేమ యుద్ధం కంటే ఎక్కువ కాదు అనే స్లోగన్ ఇచ్చారు. దీంతో ఇది లవ్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.