Nagarjuna : అక్కినేని అభిమాని మృతి.. నాగార్జున, నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్.. మా ఫ్యామిలీకి స్థంభం లాంటి వారు అంటూ..

అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని అయిన ఎద్దుల అయ్యప్ప రెడ్డి అనే వ్యక్తి తాజాగా వయోభారంతో మరణించారు.

Akkineni Nagarjuna Emotional Post on Fan Death

Nagarjuna : చాలా మంది హీరోలు తమ అభిమానులకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. కొంతమంది హార్డ్ కోర్ అభిమానులను హీరోలు మరింత దగ్గరికి తీసుకుంటారు. వారికి ఏదైనా సహాయం కావాలన్నా చేస్తారు. అభిమానులు, అభిమాన సంఘాలకు హీరోలు టైం ఇస్తారు. ఒకవేళ చాలా దగ్గరైన అభిమానులు మరణించినా వారికి నివాళులు అర్పిస్తారు. తాజాగా అక్కినేని కుటుంబానికి వీరాభిమాని అయిన ఓ వ్యక్తి మరణించడంతో నాగార్జున స్వయంగా ఆయన గురించి సోషల్ మీడియాలో షేర్ చేసి నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

కర్నూల్ కి చెందిన అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని ఎద్దుల అయ్యప్ప రెడ్డి అనే వ్యక్తి తాజాగా వయోభారంతో మరణించారు. ఈ మేరకు నాగార్జున అయ్యప్ప రెడ్డి ఫోటో షేర్ చేసి.. ఎద్దుల అయ్యప్ప రెడ్డి గారు మరణించడం నన్ను బాధకు గురిచేసింది. మా నాన్నకు ఈయన వీరాభిమాని. మా అక్కినేని ఫ్యామిలీకి ఒక స్థంభం లాంటి వారు. ఆయన మాపై చూపించిన ప్రేమ, అనురాగం మేము మరచిపోలేము. ఆయనకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు.

Also Read : Bunny Vasu : అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ కి జనసేన ఆవిర్భావ వేడుకల ఈవెంట్ అప్పగింత.. బన్నివాస్ కి జనసేనలో మరింత ప్రాధాన్యం..

నాగచైతన్య కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఓ అభిమాని మృతి చెందితే హీరో ఇలా పోస్ట్ పెట్టడంతో నాగార్జునను అక్కినేని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇటీవల నాగ చైతన్య కూడా ఓ అక్కినేని అభిమానికి ఆరోగ్యం బాగోలేకపోతే వారి ఇంటికి వెళ్లి మరి కలిసి వచ్చారు. అక్కినేని కుటుంబం తమ అభిమానులను ఒక కుటుంబంలా చూసుకుంటుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.