Chiranjeevi – Nagarjuna : బాస్‌తో కింగ్ మీటింగ్.. చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం.. గ్రాండ్ ఈవెంట్‌కు ఆహ్వానం.. ఫొటోలు వైరల్..

తాజాగా నేడు నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని కలిసి అక్కినేని జాతీయ పురస్కారం స్వీకరించాలని, ఈవెంట్ కి రావాలని ఆహ్వానించారు.

Akkineni Nagarjuna Meets Megastar Chiranjeevi and Invites for Receiving Akkineni National Award

Chiranjeevi – Nagarjuna : ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు శత దినోత్సవాలకు సంబంధించి జరిగిన ఓ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ ఈసారి అక్కినేని జాతీయ పురస్కారం చిరంజీవికి ఇస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా నేడు నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని కలిసి అక్కినేని జాతీయ పురస్కారం స్వీకరించాలని, ఈవెంట్ కి రావాలని ఆహ్వానించారు. దీంతో చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు.

Also Read : Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అప్డేట్.. రాజమౌళి కూడా చేయని జానర్లో.. నిర్మాత వ్యాఖ్యలు..

అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి అమితాబ్ బచ్చన్ రానున్నారు. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందించనున్నట్టు నాగార్జున తెలిపారు. ఇక చిరంజీవితో నాగార్జున కలిసి ఈ ఈవెంట్లో అవార్డు అందుకోడానికి రమ్మని ఆహ్వానించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేసారు నాగార్జున.

కింగ్, బాస్ కలిసి ఒకే ఫోటో ఫ్రేమ్ లో కనపడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ళు దాటినా ఇద్దరూ ఇంకా ఫిట్ గా ఉండి ఇప్పటి హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారని, అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్నారని అభినందిస్తున్నారు. ఇక అక్కినేని శత జయంతి వేడుకల ఈవెంట్ కోసం అక్కినేని అభిమానులు, మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.