Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అప్డేట్.. రాజమౌళి కూడా చేయని జానర్లో.. నిర్మాత వ్యాఖ్యలు..

పుష్ప 2 సినిమా అయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు అని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అప్డేట్.. రాజమౌళి కూడా చేయని జానర్లో.. నిర్మాత వ్యాఖ్యలు..

Producer Naga Vamsi gives Trivikram Allu Arjun Movie Update

Updated On : October 25, 2024 / 9:59 AM IST

Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతున్నాడు. నిన్నే పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసారు. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది పలువురి పేర్లు వినిపిస్తున్నా మొదట త్రివిక్రమ్ సినిమానే ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

పుష్ప 2 సినిమా అయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు అని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల పలుమార్లు నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని, భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అని అంచనాలు పెంచారు.

Also Read : Kanguva – Suriya : మొసలితో ఫైట్ సీన్ కోసం.. వారం రోజులు నీళ్లలోనే.. కంగువా కోసం సూర్య కష్టం..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. అల్లుఅర్జున్ – త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. జనవరిలో ఓ స్పెషల్ గ్లింప్స్ తో సినిమాని ప్రకటిస్తాము. మార్చ్ నుంచి మూవీ షూటింగ్ మొదలుకానుంది. అల్లు అర్జున్ కూడా మార్చ్ లోనే ఆ సినిమా షూట్ లో పాల్గొంటారు. ఇప్పటివరకు రాజమౌళి రకరకాల జానర్ లో సినిమాలు చేసారు. రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. దేశంలో ఎవ్వరూ చూడని ఓ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కించబోతున్నాం అని తెలిపారు.