భార్యకు ప్రేమతో: ట్వింకిల్‌ కు అక్షయ్‌ గిఫ్ట్

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 10:25 AM IST
భార్యకు ప్రేమతో: ట్వింకిల్‌ కు అక్షయ్‌ గిఫ్ట్

Updated On : December 13, 2019 / 10:25 AM IST

అక్షయ్‌ కుమార్‌ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు అరుదైన గిఫ్ట్‌ ఇచ్చారు. అదేంటంటే.. ఉల్లిపాయలతో చేసిన ఇయర్‌ రింగ్స్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు.. అవి చూసి ఆమె ఎలాంటి రియాక్షన్ లేకుండా వాటిని తీసుకుంది. అంతేకాకుండా వాటిని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

అయితే మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగిపోతున్న క్రమంలో అక్షయ్ తన భార్యకు కామెడీగా ఈ గిఫ్ట్‌ ఇచ్చాడు. ఆ ఫోటో చూసిన నెటిజన్లు అంతా ఈ గిఫ్ట్ నిజంగానే చాలా ఖరీదైనదేనని కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం అక్షయ్ తన కొత్త సినిమా ‘గుడ్న్యూజ్’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కరీనా కపూర్, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.