Akshay Kumar Chhatrapati Shivaji Movie shooting start
Akshay Kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. తాను ఒక మరాఠీ చిత్రంలో నటించబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు మరియు ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అక్షయ్ కుమార్ ఈ సినిమాతో మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్లే సాత్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్.. మహారాష్ట్ర దిగ్గజ రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Ram Charan-Akshay Kumar : రామ్ చరణ్, అక్షయ్ కుమార్ ఒకే వేదికపై..
కాగా నేడు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. “వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్లే సాత్ షూటింగ్ నేడు మొదలయింది. ఈ సినిమాలో నేను శివాజీ మహారాజ్ పాత్రలో నటించడం నా అదృష్టం. అయన జీవితం నుంచి పొందిన స్పూర్తితో, మా అమ్మ ఆశీర్వాదంతో సినిమాకు నా వంతు కృషి చేస్తా” అంటూ ట్వీట్ చేశాడు.
అలాగే శివాజీ పాత్రలో ఉన్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాపై హీరో అజయ్ దేవగన్ కూడా ట్వీట్ చేశాడు. శివాజీ మహారాజ్ తన ఫేవరెట్ హీరో. అయన పాత్రలో నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. గతంలో ఈ అజయ్ దేవగన్ శివాజీ సేనాధిపతి ‘తానాజీ’ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
आज मराठी फ़िल्म ‘वेडात मराठे वीर दौड़ले सात’ की शूटिंग शुरू कर रहा हूँ जिसमें छत्रपति शिवाजी महाराज जी की भूमिका कर पाना मेरे लिये सौभाग्य है।मैं उनके जीवन से प्रेरणा लेकर और माँ जिजाऊ के आशीर्वाद से मेरा पूरा प्रयास करुंगा !
आशीर्वाद बनाए रखियेगा। pic.twitter.com/MC50jCdN8Z— Akshay Kumar (@akshaykumar) December 6, 2022