అక్షయ్ ‘బెల్ బాటమ్’ వెనక్కి వెళ్లింది..
అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ 2021 ఏప్రిల్ 2న విడుదల..

అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ 2021 ఏప్రిల్ 2న విడుదల..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. మిగతా హీరోలు ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే ‘హౌస్‌ఫుల్ 4’, ‘గుడ్ న్యూస్’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అక్షయ్.. ‘సూర్యవంశీ’, ‘లక్ష్మీబాంబ్’, ‘పృథ్వీరాజ్’, ‘బచ్చన్ పాండే’, ‘బెల్ బాటమ్’ సినిమాలు చేస్తున్నాడు. సోమవారం ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’తో పోటీ వద్దనుకుని ‘బచ్చన్ పాండే’ రిలీజ్ డేట్ మార్చిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ కూడా చేంజ్ చేశారు. ముందుగా ‘బచ్చన్ పాండే’, ‘లాల్ సింగ్’ రెండు సినిమాలూ ఈ ఏడాది క్రిస్మస్‌కి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆమిర్ రిక్వెస్ట్ మేరకు ‘బచ్చన్ పాండే’ను 2021 జనవరి 22 రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వాస్తవానికి ఆ డేట్ ‘బెల్ బాటమ్’ కోసం లాక్ చేశారు.
ఇప్పుడు ‘బచ్చన్ పాండే’ కోసం ఆ డేట్ ఇవ్వడంలో ‘బెల్ బాటమ్’ మూవీని 2021 ఏప్రిల్ 2న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ‘బెల్ బాటమ్’ చిత్రానికి రంజిత్ తివారి దర్శకుడు..