Al Pacino getting prepared to break relationship with Noor Alfallah
Al Pacino : హాలీవుడ్ (Hollywood) ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్ పాసినో(Al Pacino). ఇక ఇటీవల ఈ నటుడు పేరు వరల్డ్ వైడ్ గా గట్టిగా వినిపిస్తుంది. అయితే అది సినిమా పరంగా కాదు. 83 సంవత్సరాల వయసు ఉన్న అల్ పాసినో నాలుగో సారి తండ్రి అవ్వడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు అల్ పాసినోకి కూడా ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ వయసులో తనకి అసలు తండ్రి అయ్యి అవకాశం ఉందా? అని DNA టెస్ట్ కూడా వెళ్లినట్లు సమాచారం.
Mahesh Babu : కొత్త కారు కొన్న మహేష్ బాబు.. దాని ధర ఎంతో తెలుసా..?
అల్ పాసినో.. 29 ఏళ్ల నూర్ అల్ఫాల్లా(Noor Alfallah)తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తూ వస్తున్నాడు. ఈ డేటింగ్ లో నూర్.. పాసినో వల్ల గర్భం దాల్చింది. ఈ విషయం ఈ ఏడాది మే నెలలో బయటకి వచ్చింది. ఇటీవలే నూర్ పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ బాబుకి ‘రోమన్ పాసినో’ అని పేరు కూడా పెట్టినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. అల్ పాసినో, నూర్ కంటే ముందు ఇద్దరి అమ్మాయిలతో సహజీవనం చేసి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. కానీ ఆ ఇద్దరి అమ్మాయిలను మాత్రం పెళ్లి చేసుకోలేదు.
ఇక ఇప్పుడు నూర్ ని అయినా పెళ్లి చేసుకుంటాడా? అని అందరిలో సందేహం మొదలైంది. అయితే అల్ పాసినో మాత్రం ఒకటే సిద్ధాంతం ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికి కూడా డేటింగ్, పిల్లలు ఒకే గాని పెళ్లి మాత్రం నాట్ ఓకే అంటున్నాడట. నూర్ కి ఆర్ధికంగా సెటిల్ చేసి వారి బంధాన్ని బ్రేక్ చేసుకోడానికి పాసినో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. నూర్ కోరే డిమాండ్స్ ఎదురుకునేలా అల్ పాసినో సిద్దమవుతున్నాడని హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.