50 మిలియన్స్ మార్క్ టచ్ చేసిన ‘సామజవరగమన’

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ని ‘సామజవరగమన’ సాంగ్ అక్షరాలా 50 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది..

  • Published By: sekhar ,Published On : October 24, 2019 / 10:51 AM IST
50 మిలియన్స్ మార్క్ టచ్ చేసిన ‘సామజవరగమన’

Updated On : October 24, 2019 / 10:51 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ని ‘సామజవరగమన’ సాంగ్ అక్షరాలా 50 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘సామజవరగమన’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎక్కడ విన్నా ఈ పాటే..
 సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రెండ్ అయింది..

ఇప్పుడు ‘సామజవరగమన’ సాంగ్ అక్షరాలా 50 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. యంగ్ సెన్సేషన్ సిడ్ శ్రీరామ్ చాలా బాగా పాడాడు. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. సామజవరగమన.. నినుచూసి ఆగగలనా… మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా’.. అంటూ సాగే ఈ బ్యూటీఫుల్ మెలోడీ 50 మిలియన్ల వ్యూస్‌కు పైగా వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ తెచ్చుకుని, మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Read Also : నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ : పవన్ అతిథిగా ఆడియో వేడుక

దీపావళి కానుకగా అక్టోబర్ 26న ‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్ కాగా.. టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల వైకుంఠపురములో’… రిలీజ్ కానుంది.  కెమెరా : పి.ఎస్. వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి ప్రసాద్.