అలా.. రికార్డుల వేట కొనసాగుతోందిలా!..

  • Published By: sekhar ,Published On : August 27, 2020 / 03:22 PM IST
అలా.. రికార్డుల వేట కొనసాగుతోందిలా!..

Updated On : August 27, 2020 / 4:16 PM IST

Ala Vaikunthapurramuloo TRP Record: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘అల.. వైకుంఠపురములో..’.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది. సంగీత పరంగా కూడా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.



తాజాగా బుల్లితెరపై ప్రసారమైన ఈ చిత్రం అక్కడా రికార్డు స్థాయి టీఆర్పీ సాధించింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకీ రాని టీఆర్పీ ఈ చిత్రానికి రావడం విశేషం.. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ ‘‘థియేటర్లలో విడుదలై ఏడు నెలలు. ఓటీటీలో రీలీజై ఆరు నెలలు. అయినప్పటికీ బుల్లితెరపై ‘అల వైకుంఠపురములో..’ రికార్డు టీఆర్పీ సాధించింది. 29.4 టీఆర్పీ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. మీ ప్రేమకు, ఆదరణకు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు.