Alia Bhatt interesting comments about continuing films after becoming a mother
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఇప్పటికే లక్షల మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో తెలుగు ఆడియన్స్ ను సైతం మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు భారీ సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి అల్ఫా కాగా రెండవది లవ్ అండ్ వార్.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే, అలియా భట్(Alia Bhatt) స్టార్ హీరో రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక పాప. అయితే, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా తాను తల్లి అయ్యాక వచ్చిన మార్పుల గురించి, తన తదుపరి సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Siri Hanumanth: పరువపు సిరులతో పిచ్చెక్కిస్తున్న సిరి హనుమంత్.. హాట్ ఫొటోస్
ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..’రాహా వచ్చాక వృత్తి విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎందుకంటే, నా బిడ్డ గురించి పట్టించుకోవాలి కదా. పనిలో వేగం కూడా తగ్గిపోయింది. అయినా కూడా సంతోషంగానే ఉన్నాను. ఒకప్పుడు ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేదాన్ని. కానీ, ఇక నుంచి ఒకే సినిమా ఒకే చేసి ఆ పాత్రకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను.
ఒక మహిళ తల్లయ్యాక యాక్షన్ సీన్స్ చేయడం కాస్త కష్టం. నేను చేస్తున్న ‘ఆల్ఫా’ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి. బిడ్డ పుట్టిన తర్వాత ఇలాంటి యాక్షన్ సీన్స్ చేయడం ఆందనంగా ఉంది. నా శరీరం సత్తా ఏంటో నాకు ఇప్పుడే తెలుస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది అలియా. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.