Alia Bhatt : కెమెరా మెన్ చెప్పు పట్టుకున్న అలియా భట్.. వీడియో వైరల్!

పబ్లిక్ లో కెమెరా మెన్ చెప్పు పట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. వైరల్ అవుతున్న వీడియో చూశారా?

Alia Bhatt lifts camera man slipper with her hand in public video viral

Alia Bhatt : బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ RRR తో టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గర అయ్యింది. బ్రహ్మాస్త్ర సినిమాతో కూడా ఇక్కడ ఆడియన్స్ ని ప్రకటించింది. ఆ తరువాత ప్రెగ్నెన్సీతో సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. మళ్ళీ ఇప్పుడు తిరిగి షూటింగ్స్ లో పాల్గొనబోతుంది. అయితే ఆల్రెడీ ఈ భామ నటించిన రెండు సినిమాలు ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి హాలీవుడ్ మూవీ, మరొకటి బాలీవుడ్ మూవీ. ఇది ఇలా ఉంటే, తాజాగా అలియాకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Upasana : మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్‌ని డిజైన్ చేయించిన ఉపాసన.. వీడియో వైరల్!

ముంబైలోని ఒక ఏరియాకి వచ్చిన అలియాని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ఉత్సాహపడ్డారు. అలియా కూడా వారి కోసం కొన్ని ఫోటోలు ఇచ్చింది. అయితే ఫోటోలు తీసే కంగారులో ఒక ఫోటోగ్రాఫర్ చెప్పు కాలు నుంచి జారిపడిపోయింది. ఇక అది చూసిన అలియా.. ఆ చెప్పని తన చేతితో తీసి అతడి దగ్గరికి తీసుకువెళ్లి ఇచ్చింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో.. ఒక స్టార్ నటి ఇలా చేయడం గ్రేట్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Mark Antony Song : మొదటి సారి తెలుగులో పాట పాడిన విశాల్.. ‘మార్క్ ఆంటోని’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్..

ఇక అలియా సినిమాలు విషయానికి వస్తే.. హార్ట్ అఫ్ స్టోన్ (Heart of Stone) అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ ఒక ముఖ్య పాత్ర చేస్తూ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇది తన తొలి హాలీవుడ్ మూవీ కావడంతో గర్భంతో ఉన్న సమయంలో కూడా షూటింగ్ కి వెళ్లి యాక్ట్ చేసింది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆగ‌స్టు 11న నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. అలాగే రణ్‌వీర్ సింగ్ తో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’ సినిమాలో నటిస్తుంది. జులై 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.