Alia Bhatt sings Chuttamalle song from Devara Movie
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
ఇదిలా ఉంటే.. అలియా భట్ ప్రధాన పాత్రలో ‘జిగ్ర’ అనే బాలీవుడ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ అక్టోబర్ 11 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. ఎన్టీఆర్, అలియా భట్‌లతో కలిసి ‘దేవర కా జిగ్రా’ పేరుతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూను చేశాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూ మొత్తం యూట్యూబ్‌లో విడుదలైంది.
ఇందులో దేవర మూవీలోని చుట్టమల్లే సాంగ్‌ను పాడింది అలియా భట్. అది కూడా తెలుగులోనే పాడింది. ప్రొఫెషనల్ సింగర్‌లాగా పాడింది. దీన్ని చూసి ఎన్టీఆర్ సైతం ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
.@aliaa08 sang the global sensation #Chuttamalle song ❤️❤️#Devara @tarak9999 #DevaraKaJigra pic.twitter.com/5xt5PyHAXZ
— Suresh PRO (@SureshPRO_) September 24, 2024