Suryakantham : తెరపై దడదడలాడించిన గుండమ్మకు.. తెర వెనుక ఎన్నో కష్టాలు.. గయ్యాళి అత్తగారికి వందేళ్లు..

గయ్యాళితనం అనగానే సూర్యకాంతం గుర్తుకొస్తారు. గయ్యాళి అత్తగా తెలుగువారందరి మనసులో నిలిచిపోయిన సూర్యకాంతం తన నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎప్పటికీ ఆమె పాత్రను రీప్లేస్ చేసే నటీమణి లేరన్నంతగా తన స్ధానం పదిలం చేసుకున్న సూర్యకాంతం శత జయంతి నేడు. అలాంటి అద్భుతమైన నటీమణికి నివాళులు అర్పిద్దాం.

Suryakantham

Suryakantham : గయ్యాళి అత్త పాత్రకు పెట్టింది పేరు సూర్యకాంతం గారు. ఎప్పటికీ ఆమె పాత్రను భర్తీ చేసే నటీమణి ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ పాత్రలో ఆవిడ ఒదిగిపోయారు. అలాంటి గొప్ప నటీమణి  శత జయంతి ఈరోజు. ఈ నేపథ్యంలో ఆవిడని స్మరిస్తూ నివాళులు అర్పిద్దాం.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర్లోని కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28 న జన్మించారు సూర్యకాంతం. పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మలకు జన్మించిన సూర్యకాంతం చిన్నతనం నుంచి చాలా యాక్టివ్‌గా ఉండేవారట. భయం అంటే తెలియకుండా పెరిగిన సూర్యకాంతం ఎడమచేయి తిప్పుతూ తన మాట తీరుతో అందర్నీ నవ్వించేవారట. సినిమాల్లోకి వచ్చినా అదే అలవాటు అందరినీ ఆకట్టుకుంది. ‘సతీ సక్కుబాయి’ నాటకంతో నటన వైపు అడుగులు వేసిన సూర్యకాంతం మొదట్లో అన్నీ అబ్బాయి పాత్రలే వేసారట.

Bhagavanth Kesari : థియేటర్స్ లో ‘దంచవే మేనత్త కూతురా’ రీమిక్స్ సాంగ్.. బాలయ్య, కాజల్ మాస్ డ్యాన్స్..

జెమినీ స్టూడియోలో కొంతకాలం సైడ్ డ్యాన్సర్‌గా పనిచేసిన సూర్యకాంతం 1946 లో ‘నారద నారది’ సినిమాతో తెరపై మెరిసారు. ‘సౌదామిని’ అనే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చినా అనుకోని కారు ప్రమాదం గాయాలు ఆ అవకాశాన్ని కోల్పోయేలా చేసాయి. 1950 లో వచ్చిన ‘సంసారం’ సినిమాలో గయ్యాళి అత్త పాత్ర రావడంతో ఒప్పేసుకున్నారట సూర్యకాంతం. అలా అత్త పాత్రల్లో ఒదిగిపోయి ఏకంగా 40 ఏళ్లలో 700 సినిమాల్లో నటించేసారు.

1962 లో వచ్చిన ‘గుండమ్మ కథ’ సినిమాను ఎవరూ మర్చిపోరు. ఆమె పాత్ర టైటిల్‌గా వచ్చిన ఈ సినిమాలో ఆమె గయ్యాళితనం మామూలుగా ఉండదు. అందుకే ఈ సినిమా దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు ఆ టైటిల్ పెట్టారట. రచయిత్రిగా కూడా సూర్యకాంతంగారికి మంచి పేరుంది. గరిట తిప్పడంలో సిద్ధహస్తులైన సూర్యకాంతం వంటల పుస్తకం రాసారు.

Dil Raju : టాలీవుడ్ లో మరో పెళ్లి.. దిల్ రాజు ఇంట పెళ్లి సందడి?

1950 లో మద్రాసు హైకోర్టు జడ్జి పెద్దిభోట్ల చలపతిరావుని సూర్యకాంతం పెళ్లాడారు. అయితే వీరికి సంతానం లేదు. అక్క కొడుకు అనంత పద్మనాభ మూర్తిని దత్తత తీసుకున్నారు ఈ దంపతులు. 1978 లో చలపతిరావు, 1994 డిసెంబర్ 18 న సూర్యకాంతం కన్నుమూసారు. సూర్యకాంతం త్వరగా ఎవరినీ నమ్మేవారు కాదట. అలాంటిది ఆమెను నమ్మిన వారే మోసం చేసారట. ఆ మానసిక వేదనతోనే సూర్యకాంతం కన్నుమూసారని చెబుతారు.

మంచి మనసులు, గుండమ్మ కథ, శాంతి నివాసం, చక్రపాణి, తోడికోడళ్లు, ఇల్లరికం, చిరంజీవులు, ఉమ్మడి కుటుంబం, దసరా బుల్లోడు ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అందరి మనసుల్లో సుస్థిర స్ధానాన్ని సంపాదించుకున్న సూర్యకాంతం తన సినిమాల్లో తన నటనతో అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. గయ్యాళితనం అనగానే సూర్యకాంతం అనే పేరు గుర్తుకువచ్చేలా ముద్ర వేసుకున్నారు. ఆ స్ధానాన్ని భర్తీ చేయగల నటీమణి ఎప్పటికీ రాకపోవచ్చు.