Adipurush : దేశప్రజలు బుద్ధిహీనులు అనుకుంటున్నారా..? ఆదిపురుష్ టీంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం..!
ఆదిపురుష్ మూవీ టీం పై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశప్రజలను, యువతను బుద్ధిహీనులగా భావిస్తున్నారా?

Allahabad High Court slams Adipurush team and censor board
Adipurush : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. రిలీజ్ కి ముందు రామాయణం అంటూ చెప్పుకొచ్చిన చిత్ర యూనిట్.. విడుదల తరువాత వివాదాలు రావడంతో రామాయణం కాదంటూ, దానిని నుంచి స్ఫూర్తి పొంది ఆదిపురుష్ ని తెరకెక్కించమంటూ చెప్పుకొచ్చారు. అదే విషయాన్ని సినిమా టైటిల్స్ ముందే తెలియజేసినట్లు జవాబులు ఇచ్చారు మేకర్స్. అయితే ఈ జవాబులు పై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rakesh Master : రాకేశ్ మాస్టర్ గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రత్యేక వీడియో.. ఆ హీరోలు, దర్శకులు!
సినిమాలోని కొన్ని అభ్యంతరకర డైలాగ్స్ ని తొలిగించాలంటూ కోరుతూ వేసిన పిటిషన్ పై అలహాబాద్ హై కోర్టు విచారణ జరిపింది. అసలు ఇలాంటి సంభాషణలు ఉన్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో సెన్సార్ బోర్డును ముందుగా తప్పు పట్టింది. భవిష్యత్తు తరాలకు ఇలాంటి సంభాషణలతో ఏమి నేర్పాలనుకున్నారంటూ మండిపడింది. ఇక విచారణకు ఆదిపురుష్ దర్శకనిర్మాతలు హాజరు కాకపోవడం పై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
Project K : ప్రాజెక్ట్ K టైటిల్‌ని రెడీ చేస్తున్న మేకర్స్.. అమెరికాలో టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్!
అలాగే సినిమా టైటిల్స్ ముందు.. ‘ఇది రామాయణం నుంచి స్ఫూర్తి పొందిన సినిమా మాత్రమే’ అంటూ రాసుకొచ్చిన విషయం కూడా మండిపడింది. సీతారామలక్ష్మణులు, హనుమంతుడిని, రావణుడు మరియు లంకని చూపించి అది రామాయణం కాదంటే.. మీరు దేశప్రజలను, యువతను బుద్ధిహీనులగా భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. మరి దీనికి మూవీ టీం ఎలా బదులిస్తుందో చూడాలి. కాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగా పడిపోతున్నాయి. 10 రోజులు అయినా గాని 500 కోట్లు రాబట్టలేక ఇబ్బంది పడుతుంది. దీంతో మేకర్స్ టికెట్ ధరలు తగ్గించి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.