Aa Okkati Adakku : సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన అల్లరోడి సినిమా..

ఇటీవ‌ల సీరియ‌స్ సినిమాలు చేస్తున్న అల్ల‌రి న‌రేష్ మ‌ళ్లీ త‌న కామెడీ జాన‌ర్‌లోకి వ‌చ్చి న‌టించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’.

Allari Naresh Aa okkati adakku streaming now Amazon Prime video

Aa Okkati Adakku OTT release : ఇటీవ‌ల సీరియ‌స్ సినిమాలు చేస్తున్న అల్ల‌రి న‌రేష్ మ‌ళ్లీ త‌న కామెడీ జాన‌ర్‌లోకి వ‌చ్చి న‌టించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. మ‌ల్లి అంకం ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా ఈ చిత్రాన్ని నిర్మించారు. జెమీ లివర్, వెన్నెల కిషోర్, రవి కృష్ణ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ మే 3న  ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ఓ మాదిరి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. అయితే.. ఇప్పుడు నెల కూడా తిర‌క్కుండానే ఎలాంటి హ‌డావుడి లేకుండా ఓటీటీలోకి వ‌చ్చేసింది. చాలా సినిమాలు ముందు ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి వ‌స్తుండ‌గా అల్లరోడి సినిమా మాత్రం సైలెంట్‌గా వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Gangs of Godavari Twitter Review : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వ‌క్‌లోని మాస్ యాంగిల్‌ను మ‌రో కోణంలో..!

కథ ఏంటంట‌..?
గణ(అల్లరి నరేష్) ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఏజ్ పెరిగినా పెళ్లవ్వదు. ఇంట్లో తమ్ముడికి(రవికృష్ణ) ఆల్రెడీ తన మరదలితో(జెమీ లివర్) పెళ్లి అయిపోతుంది. వాళ్లకి ఓ పాప కూడా ఉంటుంది. ఓ సమయంలో అనుకోకుండా గణ వల్ల ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. పెళ్లి కాని అబ్బాయిలకి ఉండే ఫ్రస్టేషన్ చుట్టుపక్కల వాళ్ళని మాటలు చూస్తూ ఉంటాడు గణ. ఎన్ని సంబంధాలు ట్రై చేసినా అన్ని వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఈ క్రమంలో ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో మాట్రిమోనీలో జాయిన్ అవుతాడు. హ్యాపీ మ్యాట్రిమోనీ అనే సంస్థలో డబ్బులు కట్టి స్కీమ్స్ ప్రకారం ట్రై చేస్తూ ఉంటాడు.

ఇలా మ్యాట్రిమోనీలో పెద్ద స్కీమ్ తీసుకున్నాక సిద్ధి(ఫరియా అబ్దుల్లా) కలుస్తుంది. అయితే గతంలోనే ఓ సంఘటనలో సిద్ధి అల్లరి నరేష్ కి వచ్చి హగ్, కిస్ ఇస్తుంది. దీంతో అప్పటి నుంచే ఆ అమ్మాయిని గుర్తు పెట్టుకుంటాడు. సిద్ధి కూడా పెళ్లి కోసం చూస్తుందని తెలియడంతో వేరే ఆప్షన్స్ వద్దు, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటాడు. కానీ సిద్ధి మాత్రం నాకు ఇంకా ఆప్షన్లు ఉన్నాయి మిమ్మల్ని వెయిటింగ్ లో పెడతాను అంటుంది. అదే సమయంలో గణ వాళ్ళ అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి పెళ్లి చూసి చచ్చిపోవాలి అనే సెంటిమెంట్ తో మాట్లాడుతుంది. మరి గణ పెళ్లి అయిందా? సిద్ధి ఓకే చెప్పిందా? హ్యాపీ మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసం ఏంటి? సిద్ది ఇచ్చే ట్విస్ట్ ఏంటి? ఆ యాక్సిడెంట్ ఎవరికి జరిగింది? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Sriranga Neethulu : ఆహాలో దూసుకుపోతున్న సుహాస్ ‘శ్రీరంగనీతులు’.. మూడు కథలతో..