‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వ‌క్‌లోని మాస్ యాంగిల్‌ను మ‌రో కోణంలో..!

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'.

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వ‌క్‌లోని మాస్ యాంగిల్‌ను మ‌రో కోణంలో..!

Vishwak Sen Gangs of Godavari Twitter Review

Updated On : May 31, 2024 / 10:20 AM IST

Gangs of Godavari Twitter Review : మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’. కృష్ణ చైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో నేహా శెట్టి క‌థానాయిక‌. అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టించగా యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాల‌య్య రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఇక తాజాగా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. మ‌రీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఎలా ఉంది? సినిమా చూస్తున్న ప్రేక్ష‌కులు ట్విట్ట‌ర్‌లో ఏమంటున్నారు అన్న‌ది చూద్దాం.. లంక‌ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ న‌ట‌న అద్భుత‌మ‌ని అంటున్నారు. విశ్వ‌క్‌లోని మాస్ కోణాన్ని డిఫ‌రెంట్‌గా చూపించార‌ని చెబుతున్నారు. డైలాగ్స్ బాగున్నాయ‌ని ట్వీట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఎక్స్‌లెంట్ అని, సెకండ్ హాఫ్ బాగుందని ఒక‌రు ట్వీట్ చేశారు. క్లైమాక్స్‌లో తండ్రీకూతుళ్ల సన్నివేశాలు, ముగింపు సన్నివేశాలు సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయని అంటున్నారు.