Allari Naresh : పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రాబోతున్న అల్లరి నరేష్.. అల్లరోడికి వర్కౌట్ అవుతుందా?

నాంది సినిమా నుంచి అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అప్పట్నుంచి వైవిధ్యమైన కథలతో వస్తూ వరుసగా ప్రేక్షకులని మెప్పిస్తున్నారు.

Allari Naresh coming with Periodic Action Drama in soon

Allari Naresh : అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టి ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చేసుకొని అల్లరి నరేష్ అయ్యాడు. మొదట్లో ఫుల్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు అల్లరి నరేష్. మధ్యమధ్యలో నేను, శంభో శివ శంభో, గమ్యం.. లాంటి ఆసక్తికర పాత్రలతో కూడా మెప్పించాడు నరేష్. కానీ గత కొన్నాళ్లుగా తన పంథా మార్చి తన కామెడీ జానర్ వదిలిపెట్టి కొత్త తరహా కథలతో సినిమాలు చేస్తున్నారు.

నాంది సినిమా నుంచి అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అప్పట్నుంచి వైవిధ్యమైన కథలతో వస్తూ వరుసగా ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సభకు నమస్కారం, బచ్చలమల్లి, ఇంకో లవ్ జానర్ సినిమా ఉంది. తాజాగా అల్లరి నరేష్ ఎప్పుడూ టచ్ చేయని ఓ పీరియాడిక్ యాక్షన్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

సందీప్ కిషన్ ఊరుపేరై భైరవకోన సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రనిర్మాత రాజేష్ దండా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేము మొదటి నుంచి సినిమా సినిమాకి జానర్ మారుస్తున్నాము. ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో తీసుకొస్తున్నాము. మొదట సోషల్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇది సోషియో ఫాంటసీ. తర్వాత అల్లరి నరేష్ తో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీస్తున్నాము, తర్వాత కిరణ్ అబ్బవరంతో ఫాంటసీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తున్నాము అని తెలిపారు.

Also Read : PV Sindhu : విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చలేదు.. పేర్లు చెప్తే కాంట్రవర్సీ అవుతుంది.. పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు..

అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త కొత్త కథలతో వస్తున్న సంగతి తెలిసిందే. మెసేజ్ కథలతో పాటు యాక్షన్ కూడా చేస్తున్నాడు కానీ పీరియాడిక్ యాక్షన్ అంటే అల్లరి నరేష్ ఎంతవరకు సెట్ అవుతాడో, ఆ పాత్రలో ఎలా కనిపిస్తాడో, యాక్షన్ ఏ రేంజ్ లో చేస్తాడో చూడాలి మరి.

ట్రెండింగ్ వార్తలు