PV Sindhu : విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చలేదు.. పేర్లు చెప్తే కాంట్రవర్సీ అవుతుంది.. పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు..

తాజాగా పీవీ సింధు ఓ ఇంటర్వ్యూలో సినిమాలు, కొంతమంది హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

PV Sindhu : విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చలేదు.. పేర్లు చెప్తే కాంట్రవర్సీ అవుతుంది.. పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు..

Badminton Player PV Sindhu Sensational Comments on Vijay Deverakonda Movies

Updated On : February 14, 2024 / 9:06 AM IST

PV Sindhu : స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా దేశ విదేశాల్లో, ఎన్నో టోర్నమెంట్స్ లో మెడల్స్ సాధించింది పీవీ సింధు. బ్యాడ్మింటన్(Badminton) ప్లేయర్ గా ఇంటర్నేషనల్ వైడ్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. పీవీ సింధు మన తెలుగమ్మాయి అని తెలిసిందే. సింధుకి సినీ పరిశ్రమలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు సినిమా వాళ్ళ పార్టీలలో కూడా సింధు కనిపిస్తుంది. తాజాగా పీవీ సింధు ఓ ఇంటర్వ్యూలో సినిమాలు, కొంతమంది హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పీవీ సింధు మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ లో ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి ఎక్కువగా సినిమాలు చూస్తాను. ప్రభాస్ అంటే క్రష్. రామ్ చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ ఇష్టం. RRR సినిమా నచ్చింది. చిరంజీవి(Chiranjeevi) గారు నాకు మెడల్ వచ్చినప్పుడు పిలిచి అభినందించారు. చాలా మంచి మనిషి. బాగా ఎంకరేజ్ చేస్తారు. అప్పుడే చరణ్ ని కూడా కలిసాను. ఇటీవల చాలా మంది యాక్టర్స్ వస్తున్నారు. ఒక్కరి యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పలేను, చాలా సినిమాలు చూస్తాను కాబట్టి అని తెలిపింది. అయితే యాంకర్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సినిమాలు చూశారా అని అడిగారు.

Also Read : Priyanka Nalkari : సీక్రెట్‌గా ప్రేమించి పెళ్లి చేసుకొని సంవత్సరం తిరక్కుండానే.. భర్తతో విడిపోయిన నటి..

దీనికి పీవీ సింధు మాట్లాడుతూ.. ఆయన సినిమాలు చేస్తున్నారు. అందులో కొన్ని సినిమాలు నచ్చాయి. కొన్ని నచ్చలేదు. అవి చెప్తే మళ్ళీ కాంట్రవర్సీలు అవుతాయి. కానీ అది నా ఒపీనియన్. నాకు నచ్చని సినిమాలు వేరే వాళ్లకు నచ్చొచ్చు. సినిమా కూడా చాలా కష్టం. నెలల తరబడి షూటింగ్స్ చేస్తారు. అది హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో తెలీదు. సక్సెస్ అవ్వాలనే సినిమాలు చేస్తారు. వాళ్లపై కూడా ఒత్తిడి ఉంటుంది అని అన్నారు. దీంతో పీవీ సింధు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.