Priyanka Nalkari : సీక్రెట్‌గా ప్రేమించి పెళ్లి చేసుకొని సంవత్సరం తిరక్కుండానే.. భర్తతో విడిపోయిన నటి..
ప్రియాంక ఇటీవల సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు, మీ భర్తతో విడిపోయారా అని ప్రశ్నించగా

Priyanka Nalkari separated from her husband within a year of getting married
Priyanka Nalkari : మన తెలుగమ్మాయి ప్రియాంక నల్కరి తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, తమిళ్ సీరియల్స్ తో బిజీ అయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సీరియల్స్, టీవీ షోలు, అప్పుడప్పుడు సినిమాలతో పలకరిస్తుంది ప్రియాంక. తెలుగులో ఇటీవల జబర్దస్త్ లాంటి షోలలో కూడా అలరించింది. యాంకర్ గా కూడా కొన్ని షోలు చేసింది. తాజాగా ప్రియంక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రియాంక ఇటీవల సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు, మీ భర్తతో విడిపోయారా అని ప్రశ్నించగా అవును అని సమాధానం ఇచ్చింది. ప్రియాంక గత సంవత్సరం మార్చ్ లో రాహుల్ వర్మ అనే నటుడ్ని మలేషియాలోని ఓ ఆలయంలో సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. అనంతరం పెళ్లి చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read : Emraan Hashmi : బాలీవుడ్ వాళ్ళు సినిమాల్లో డబ్బులు వేస్ట్ చేస్తారు.. కానీ సౌత్ ఫిలిం మేకర్స్..
ప్రేమించి సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న ప్రియాంక రాహుల్ వర్మలు ఏడాది తిరక్కుండానే విడిపోయారు అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. వారిద్దరి మధ్య విడిపోయేంతగా ఏం జరిగిందో అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ప్రియాంక నల్కరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.