×
Ad

12A Railway Colony Review : ’12A రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ సస్పన్స్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది..?

అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన కామెడీ వదిలేసి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నా ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అన్నట్టు తయారయింది. (12A Railway Colony Review)

12A Railway Colony Review

12A Railway Colony  Review : అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల జంటగా తెరకెక్కిన సినిమా ’12A రైల్వే కాలనీ’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో పొలిమేర డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వ పర్యవేక్షణలో నాని కాసరగడ్డ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 12A రైల్వే కాలనీ సినిమా నేడు నవంబర్‌ 21న థియేటర్స్ లో విడుదల అయింది.(12A Railway Colony Review)

కథ విషయానికొస్తే.. వరంగల్ లో కార్తీక్(అల్లరినరేష్) ఓ అనాథ. ఫ్రెండ్స్ తో కలిసి తాగుతూ తిరుగుతూ లోకల్ లీడర్ టిల్లు అన్న(జీవన్) దగ్గర తిరుగుతూ ఉంటాడు. టిల్లు అన్న ఈసారైనా ఎమ్మెల్యే అవ్వాలని రాజకీయాల్లో బిజీగా ఉంటాడు. కార్తీక్ ఇంటి పక్కనే ఉండే ఆరాధన(కామాక్షి భాస్కర్ల)ని ఇష్టపడతాడు. ఆరాధన ఇంటికి షిండే(అనీష్ కురువిళ్ళ) వచ్చి వెళ్లడం రెండు మూడు సార్లు చూస్తాడు కార్తీక్. ఆరాధన బ్యాడ్మింటన్ ఛాంపియన్. నేష్నల్స్ లో ఆడాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ అందుకు కావాల్సిన డబ్బుల కోసం తిరుగుతుంది. ఈ విషయం కార్తీక్ కి తెలిసి తన కోసం డబ్బు రెడీ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో టిల్లు అన్న కార్తీక్ కి ఒక పార్శిల్ ఇచ్చి జాగ్రత్తగా దాయమని చెప్తాడు. ఎలెక్షన్ టైం రైడ్స్ జరుగుతున్నాయని తెలియడంతో కార్తీక్ పక్క ఇంట్లో ఆరాధన వాళ్ళు ఊళ్ళో లేరని వాళ్ళింట్లో ఆ పార్సిల్ దాయడానికి వెళ్తాడు. లోపల ఆరాధన వచ్చి నన్ను బయటకు తీసుకెళ్ళు అని కార్తీక్ ని అడుగుతుంది. కానీ ఆ ఇంట్లో ఆరాధన, వాళ్ళ అమ్మ అప్పటికే చనిపోయి ఉండటంతో షాక్ కి గురయి కళ్ళు తిరిగి పడిపోతాడు కార్తీక్. అసలు ఆరాధన – వాళ్ళమ్మని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? షిండే ఎవరు? టిల్లు అన్న ఎమ్మెల్యే అవుతాడా? టిల్లు అన్న కార్తీక్ కి ఇచ్చిన పార్సిల్ లో ఏముంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Premante Review : ‘ప్రేమంటే’ మూవీ రివ్యూ.. భార్యతో కలిసి దొంగతనాలు చేయడం ఏంట్రా.. భలే ఉందే..

సినిమా విశ్లేషణ..

అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన కామెడీ వదిలేసి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నా ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అన్నట్టు తయారయింది. పొలిమేర సినిమాల దర్శకుడు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేయడం – ఈయనతో అల్లరి నరేష్ కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కార్తీక్ – ఫ్రెండ్స్ సీన్స్, హీరోయిన్ వెంట పడటం సీన్స్ తో చాలా రొటీన్ గా సాగుతుంది. ఫ్రెండ్స్ సీన్స్ తాగుడు తిరుగుడు అన్నట్టు చిన్న సినిమాల్లో సీన్స్ లాగా క్వాలిటీ లేకుండా ఉంటాయి. అసలు ఇంటెర్వెల్ వరకు సినిమా ఏదో సాగుతుంది అన్నట్టు సాగదీశారు.

ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ లో చాలా సీన్స్, పాట తీసేయొచ్చు. సెకండ్ హాఫ్ లో కథ ఇంట్రెస్టింగ్ గా సాగినా ట్విస్ట్ లు రివీల్ అయినా కథ పరంగా చూస్తే బాగానే ఉంది. కానీ మధ్యలో అక్కర్లేని ఓ విషాద గీతం వస్తుంది. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో ముందుకి వెనక్కు వెళ్తుండటంతో కన్ఫ్యూజన్ రావడం ఖాయం. కథ అంతా సెకండ్ హాఫ్ లోనే చెప్పాలని చూడటంతో కొన్ని చోట్ల సాగదీశారు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఇచ్చారు కానీ అది కూడా ఊహించేయొచ్చు. ఒక మంచి థ్రిల్లింగ్ కథని రొటీన్ సీన్స్ తో సరిగ్గా రాసుకోలేదు అనిపిస్తుంది. సినిమా అంతా వరంగల్ బ్యాక్ డ్రాప్ లో తీసుకొని అల్లరి నరేష్, ఆ చుట్టూ ఉన్న ఆర్టిస్టులతో తెలంగాణ యాస మాట్లాడించారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో లేడీస్ మీద వల్గర్ గా రాసుకున్న డైలాగ్స్ అవసరమా అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..

అల్లరి నరేష్ నటుడిగా ఆల్రెడీ ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ లో లేజీగా నటించినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ నుంచి మాత్రం తన నటనతో మెప్పిస్తాడు. కామాక్షి భాస్కర్ల బాగానే మెప్పించింది. జీవన్ కుమార్ రాజకీయ నాయకుడి పాత్రలో బాగానే సెట్ అయ్యాడు. వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం.. కామెడీ ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. అనీష్ కురువిళ్ళ, సాయి కుమార్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. ఒకప్పటి హీరోయిన్ అభిరామి గెస్ట్ అప్పీరెన్స్ పాత్రలో బాగానే మెప్పించింది.

Also Read : Raju Weds Rambai Review : ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ.. బాబోయ్ ఇదెక్కడి క్లైమాక్స్ రా బాబు..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ యావరేజ్. పొలిమేర దర్శకుడేనా ఈ కథ – స్క్రీన్ ప్లే రాసింది అనే డౌట్ రావడం ఖాయం. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త క్లారిటీగా రాసుకోవాల్సింది. ఎడిటిగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్, ఓ పాట కట్ చేస్తే బెటర్. సెకండ్ హాఫ్ లో కూడా ఓ సాంగ్ కట్ చేస్తే బెటర్. దర్శకుడే ఎడిటర్ కావడం గమనార్హం. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ’12A రైల్వే కాలనీ’ సినిమా ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ క్రైం థ్రిల్లర్. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.