Allari Naresh : పొలిమేర డైరెక్టర్ తో అల్లరి నరేష్ సినిమా.. టైటిల్ టీజర్ అదిరిందిగా.. భయపడటానికి రెడీగా ఉండండి..

తాజాగా అల్లరి నరేష్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు.

Allari Naresh Kamakshi Bhaskarla 12A Railway Colony Title Teaser Released

Allari Naresh : అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ కథలతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బచ్చల మల్లి సినిమాతో వచ్చినా ఆ సినిమా అంతగా ఆడలేదు. తాజాగా అల్లరి నరేష్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో భారీ హిట్స్ కొట్టిన దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో నాని కసరగడ్డ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also See : Kalyan Ram Vijayashanthi : ఎమ్మెల్సీ అయ్యాక మొదటిసారి సినిమా ఈవెంట్ కి వచ్చిన విజయశాంతి.. ఫొటోలు వైరల్..

నేడు ఈ సినిమా టైటిల్ ప్రకటించి గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు 12A రైల్వే కాలనీ అనే టైటిల్ ని పెట్టారు. పొలిమేర సినిమాల్లాగే ఈ సినిమా కూడా క్షుద్రపూజలు, ఆత్మలతో సాగుతుంది అని గ్లింప్స్ లో చెప్పేసారు. ఆత్మలు కొంతమందికే ఎందుకు కనపడతాయి అంటూ సాగిన ఈ టైటిల్ టీజర్ ఆసక్తిగా ఉంది. దీంతో ఈసారి అల్లరి నరేష్ భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు అని తెలుస్తుంది. మీరు కూడా అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ టైటిల్ టీజర్ చూసేయండి..

ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.