Balayya
Balakrishna : సినిమా షూటింగ్స్ ఒకదాని పక్క ఒకటి జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో హీరోలు, దర్శకులు ఒకరి సెట్ లోకి వెళ్లి మరొకరిని పలకరిస్తారు. ఇలా చాలా సార్లు జరిగిందే. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK 107 షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోనే అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.
Kishore Das : క్యాన్సర్‌తో యువ హీరో మృతి..
ఇంకేముంది అల్లరి నరేష్ అండ్ టీం బాలకృష్ణ షూటింగ్ స్పాట్ కి వెళ్లి ఆయన్ని కలిశారు. బాలకృష్ణ సరదాగా అల్లరి నరేష్, ఆర్టిస్ట్ ప్రవీణ్.. పలువురు చిత్ర యూనిట్ తో ముచ్చటించారు. బాలకృష్ణతో అల్లరి నరేష్ కలిసి కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.