Kishore Das : క్యాన్సర్‌తో యువ హీరో మృతి..

గత కొన్ని రోజులుగా కిషోర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం మార్చిలో చెన్నై వచ్చి ఇక్కడి హాస్పిటల్ లోనే క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న కిషోర్ కి.........

Kishore Das : క్యాన్సర్‌తో యువ హీరో మృతి..

Kishore Das :   సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అస్సామీ నటుడు కిశోర్‌ దాస్‌ క్యాన్సర్ తో చికిత్స తీసుకుంటూ మరణించారు. అస్సామీ సినీ, టీవీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న యువ నటుడు కిశోర్ దాస్ ఒకరు. సీరియల్స్ తో తన కెరీర్ ని మొదలుపెట్టి టీవీ ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు కిషోర్. ఆ తర్వాత 300కుపైగా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నటించి మరింత పాపులర్ అయ్యాడు. ‘తురుట్‌ తురుట్’‍ సాంగ్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగాడు కిషోర్. ఇక సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఇప్పుడిప్పుడే మంచి విజయాలు అందుకుంటున్నాడు.

Nani : ‘అంటే సుందరానికి’ వచ్చేస్తున్నాడు ఓటీటీలోకి..

గత కొన్ని రోజులుగా కిషోర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం మార్చిలో చెన్నై వచ్చి ఇక్కడి హాస్పిటల్ లోనే క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న కిషోర్ కి కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కరోనా కారణంగా అతని మృతుదేహాన్ని అస్సాంలోని తన స్వస్థలానికి పంపడానికి అనుమతులు లేకపోవడంతో కిశోర్ దాస్‌ అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు. కిషోర్ దాస్ మరణ వార్త విని అస్సాం సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అభిమానులు, పలువురు ప్రముఖులు కిషోర్ కి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

ఇటీవల క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ హాస్పిటల్ బెడ్ మీద నుంచి తాను బాగానే ఉన్నాను చికిత్స తీసుకుంటున్నాను, త్వరలోనే తిరిగి వస్తాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతలోనే ఇలా జరగడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.