Theppa Samudram : బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా ‘తెప్ప సముద్రం’ టీజర్ రిలీజ్.. అల్లరి నరేష్ చేతుల మీదుగా..

తెప్ప సముద్రం టీజర్ ని అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Allari Naresh Released Arjun Ambati Chaitanya Rao Theppa Samudram Movie Teaser

Theppa Samudram Teaser : బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా, రవి శంకర్ ముఖ్య పాత్రలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నీరుకంటి మంజుల, రాఘవేందర్ గౌడ్ నిర్మాణంలో సతీష్ రాపోలు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తెప్ప సముద్రం’.

నిన్న శివరాత్రి సందర్భంగా ఈ తెప్ప సముద్రం టీజర్ ని అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే.. వరుస అమ్మాయిల హత్యలు, మర్డర్ మిస్టరీ కథలా అనిపిస్తుంది. తెలంగాణలో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్టు సమాచారం.

టీజర్ రిలీజ్ చేసిన అనంతరం అల్లరి నరేష్.. తెప్ప సముద్రం టీజర్ ఒక మంచి థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక ఈ తెప్ప సముద్రం సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది.