Site icon 10TV Telugu

Allari Naresh : కామెడీ చేసేవాళ్ళంటే ఇండస్ట్రీలో చిన్న చూపు ఉంది.. అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు..

Allari Naresh sensational comments on comedy actors

Allari Naresh sensational comments on comedy actors

Allari Naresh :  అల్లరి నరేష్(Allari Naresh), మిర్నా జంటగా నాంది(Nandi) దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉగ్రం(Ugram) సినిమా మే 5న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇందులో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నాంది డైరెక్టర్ తో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ కాంబోపై అంచనాలు నెలకొని ఈ సినిమా కూడా హిట్ కొడుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉగ్రం చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా అల్లరి నరేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరూ కామెడీ పాత్రలు చేయడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ అన్నిటికంటే కామెడీనే చాలా కష్టం. కామెడీ పాత్రలు చేసే వాళ్ళు ఏ పాత్ర అయినా అద్భుతంగా చేయగలరు. ఇటీవల రంగమార్తాండలో బ్రహ్మానందం, విడుదలలో సూరి వారి పాత్రలతో మెప్పించారు. నన్ను క్రిష్ గారు నమ్మరు కాబట్టే గమ్యం సినిమా వచ్చింది. సముద్రఖని గారు శంభో శివ శంభో ఇచ్చారు. ఇప్పుడు విజయ్ నాంది, ఉగ్రం సినిమాలు ఇచ్చాడు. మహర్షి సినిమా తర్వాత నేను ఇలాంటి పాత్రలు చేయగలనని అందరూ నమ్ముతున్నారు అని తెలిపారు.

Naga Chaitanya : యాక్టర్స్ కెరీర్ లో ఇవి సహజం.. ఏజెంట్ ఫ్లాప్ గురించి మాట్లాడిన నాగచైతన్య..

అలాగే.. సినిమాల్లో కామెడీనే కాదు ఏ జోనర్ కూడా సేఫ్ కాదు. కితకితలు, బెండు అప్పారావు, సుడిగాడు లాంటి హిట్ సినిమాలు చూసినప్పుడు నరేష్ సినిమా బాగుంది అన్నారు కానీ ఎవ్వరూ నా యాక్టింగ్ గురించి మాట్లాడలేదు. కానీ గమ్యం, శంభో శివ శంభో, ఇప్పుడు నాంది సినిమాలు చూశాక సినిమా కంటే కూడా నరేష్ బాగా నటించాడు అని అంటున్నారు. కామెడీ చేసేవాళ్ళంటే ఆడియన్స్ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా కొంచెం చిన్న చూపు ఉంది. ఈ విషయంలో నాకు కొంచెం బాధగా ఉంటుంది అని అన్నారు. దీంతో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

 

Exit mobile version