Naga Chaitanya : యాక్టర్స్ కెరీర్ లో ఇవి సహజం.. ఏజెంట్ ఫ్లాప్ గురించి మాట్లాడిన నాగచైతన్య..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఇండైరెక్ట్ గా అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడాడు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక దారుణంగా పరాజయం అయింది.

Naga Chaitanya : యాక్టర్స్ కెరీర్ లో ఇవి సహజం.. ఏజెంట్ ఫ్లాప్ గురించి మాట్లాడిన నాగచైతన్య..

Naga Chaitanya comments on Akhil Agent movie Flop

Naga Chaitanya :  నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ(Custody) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. నాగచైతన్య, కృతి శెట్టి(Krithi Shetty) జంటగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కస్టడీ. ఇందులో నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాని 90లలో జరిగిన కథగా చూపించనున్నారు. కస్టడీ సినిమా మే 12న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఇండైరెక్ట్ గా అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడాడు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక దారుణంగా పరాజయం అయింది. అలాగే నాగచైతన్య గత సినిమా థ్యాంక్యూ కూడా పరాజయం పాలైంది. దీంతో ఈ సినిమాల రిజల్ట్ గురించి నాగచైతన్య మాట్లాడారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. అభిమానులకు మేము మంచి సక్సెస్ ఇవ్వాలనే అనుకుంటాం. వారి అభిమానం, ప్రేమకు మేము తిరిగి ఇచ్చేది ఒక మంచి సినిమానే. ఇటీవల మా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొన్ని సినిమాలకు మంచి రిజల్ట్ రాలేదు. యాక్టర్స్ కెరీర్ లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. ఈ టైం వెళ్ళిపోతుంది. తప్పకుండా మేము మళ్ళీ ప్రేక్షకులని అలరిస్తాము. మా ఫ్యాన్స్ ఆశించే ఫలితం కస్టడీ నుంచి రాబోతుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు.

Shah Rukh Khan : అభిమానిని నెట్టేసిన షారుఖ్.. వీడియో వైరల్!

అలాగే.. నాన్న గారి శివ సినిమా అంటే అందరి ఆడియన్స్ లాగే నాకు కూడా ఎంతో గౌరవం. కస్టడీ సినిమాలో నా క్యారెక్టర్ పేరు ‘శివ’నే. ఆ పేరే టైటిల్ గా మొదట పెడదామనుకున్నాం కానీ ఆ సినిమా మీద ఉన్న గౌరవంతో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టలేదు.