Allari Naresh : రచయితగా అల్లరి నరేష్.. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తనే రాసుకుంటున్నాడట..

తాజాగా 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు.

Allari Naresh : ఒకప్పుడు కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అల్లరి నరేష్. తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించాడు. కామెడీ సినిమాలతోనే ఎన్నో సూపర్ హిట్స్ కొట్టాడు. కానీ ఒకానొక సమయంలో తన కామెడీ సినిమాలు వరుసగా ఫెయిల్ అవ్వడంతో తనలోని మరో నటుడ్ని బయటకు తీసి సీరియస్ సబ్జెక్ట్స్ ని చేస్తున్నారు. నాంది, ఉగ్రం.. లాంటి సీరియస్ కథలతో కూడా మంచి హిట్స్ కొట్టిన అల్లరి నరేష్ ఇప్పుడు మళ్ళీ కామెడీ సినిమాతో వస్తున్నారు.

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే టైటిల్ తో పెళ్లి కాన్సెప్ట్ తో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ని తీసుకురాబోతున్నారు. ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు.

Also Read : Jersey : ‘జెర్సీ 2’ ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ క్రమంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. సుడిగాడు 2 కథ నేనే రాస్తున్నాను. త్వరలోనే అది పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆ సినిమా వచ్చేలా చూస్తాను అని తెలిపారు. సుడిగాడు సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ సినిమా కేవలం 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 32 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ప్రకటించడం, దానికి తనే రచయితగా మారానని అల్లరి నరేష్ చెప్పడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి దర్శకత్వం కూడా నరేష్ చేస్తాడా లేక వేరే వాళ్ళకి ఇస్తారా చూడాలి. అలాగే తన కితకితలు సినిమా కూడా రీ రిలీజ్ ప్లాన్ చేస్తానని ఈ ఈవెంట్లో తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు