Jersey : ‘జెర్సీ 2’ ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నాని గెస్ట్ గా వచ్చారు.

Jersey : ‘జెర్సీ 2’ ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

Nani sensational Comments on Jersey 2 Movie in a Event

Updated On : April 23, 2024 / 7:34 AM IST

Jersey : గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని(Nani) హీరోగా అయిదేళ్ల క్రితం వచ్చిన జెర్సీ సినిమా మంచి విజయం సాధించింది. అయితే కమర్షియల్ గా భారీ కలెక్షన్స్ రాకపోయినా అందరి ప్రశంసలు దక్కించుకుంది. నాని కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో జెర్సీ ఒకటని చెప్పొచ్చు. నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది ఈ సినిమా. ఈ సినిమా నాని మనసుకు చాలా దగ్గరైంది. ఇటీవలే జెర్సీ అయిదేళ్ల సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహించారు.

తాజాగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నాని గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో అభిమానులు జెర్సీ 2 సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగారు. దీనికి నాని సమాధానమిస్తూ.. నేను లేను కదా.. జెర్సీ 2 ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు. జెర్సీ సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర చనిపోతుంది. దీంతో నానితో సీక్వెల్ తీయలేరు కాబట్టి నాని ఇలా ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం గమనార్హం.

Also Read : Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

ఒకవేళ నిజంగా జెర్సీ 2 తీస్తే పెద్దయ్యాక నాని కొడుకు పాత్రలో నటించిన హరీష్ కళ్యాణ్ తో తీయాలి. మరి జెర్సీ 2 వస్తుందా లేదా దర్శకుడు గౌతమ్ కే తెలియాలి.