Ugram: ఉగ్రం.. మొదలుపెట్టిన అల్లరి నరేష్!

యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం వరుసబెట్టి సీరియస్ మూవీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నాంది చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీతో కూడా అల్లరి నరేష్ మరోసారి భారీ అంచనాలు క్రియేట్ చేశాడు.

Allari Naresh Ugram Movie Shooting Started

Ugram: యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం వరుసబెట్టి సీరియస్ మూవీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నాంది చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీతో కూడా అల్లరి నరేష్ మరోసారి భారీ అంచనాలు క్రియేట్ చేశాడు.

Allari Naresh Ugram: అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాకు హీరోయిన్ దొరికేసింది!

నాంది చిత్రంతో తనకు అదిరిపోయే సక్సెస్‌ను అందించిన దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరోసారి నటించేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సీరియస్ మూవీ ‘ఉగ్రం’ తెరకెక్కబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్‌ను వదిలింది చిత్ర యూనిట్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించినట్లుగా ఓ సూపర్బ్ వీడియో గ్లింప్స్‌తో తెలియజేశారు.

Allari naresh, Nagashorya new movies opening : అల్లరి నరేష్ కొత్త సినిమా ‘ఉగ్రం’, నాగ శౌర్య కొత్త సినిమా ఓపెనింగ్ గ్యాలరీ

ఇక ఈ గ్లింప్స్ వీడియోలో అల్లరి నరేష్ ముఖం పూర్తిగా నలుపు రంగులో ఉండగా, అతడు కేవలం కళ్లతోనే చేసిన ఎక్స్‌ప్రెషన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ గ్లింప్స్ వీడియోకు శ్రీచరణ్ పాకాల అందించిన బీజీఎం వేరే లెవెల్‌లో ఉండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.