Allu Aravind : సాయి పల్లవిని నా కూతురులా చూస్తాను.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ ఈవెంట్లో సాయి పల్లవి గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ..

Allu Aravind Interesting Comments on Sai Pallavi goes Viral

Allu Aravind : నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తండేల్ సినిమా తెరకెక్కుతుంది. నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కుతుంది తండేల్. శ్రీకాకుళంలోని కొంతమంది మత్స్యకారుల జీవితకథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో ఉంది.

Also Read : Thandel : సంక్రాంతికి మేము అనుకోలేదు.. అల్లు అరవింద్ కామెంట్స్.. నాగ చైతన్య ‘తండేల్’ రిలీజ్ డేట్ అనౌన్స్.. కొత్త పోస్టర్..

తాజాగా నేడు తండేల్ ప్రెస్ మెట్ పెట్టి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ క్నున్నట్టు తెలిపారు. ఈ ఈవెంట్ కు సాయి పల్లవి కూడా వచ్చింది. దీంతో ఈ ఈవెంట్లో సాయి పల్లవి గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అమరన్ సినిమా చూసాను. బయటకు వచ్చేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆఖరున సాయి పల్లవి వచ్చి ఊపి వదిలేసింది అందర్నీ. ఆ ఎమోషన్ లోనే సాయి పల్లవితో మాట్లాడాలని బయటకు రాగానే ఆమెకు కాల్ చేసి మాట్లాడాను. నేను ఆమెను ఎప్పుడూ ఒక కూతురులా చూస్తాను. నాకే గనక కూతురు ఉంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది అని అన్నారు.

అలాగే అమరన్ సక్సెస్ అయినందుకు సాయి పల్లవిని అల్లు అరవింద్, తండేల్ యూనిట్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. దీంతో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.