Thandel : సంక్రాంతికి మేము అనుకోలేదు.. అల్లు అరవింద్ కామెంట్స్.. నాగ చైతన్య ‘తండేల్’ రిలీజ్ డేట్ అనౌన్స్.. కొత్త పోస్టర్..

తాజాగా నేడు తండేల్ ప్రెస్ మెట్ పెట్టి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.

Thandel : సంక్రాంతికి మేము అనుకోలేదు.. అల్లు అరవింద్ కామెంట్స్.. నాగ చైతన్య ‘తండేల్’ రిలీజ్ డేట్ అనౌన్స్.. కొత్త పోస్టర్..

Naga Chaitanya Sai Pallavi Thandel Movie Release Date Announced by Allu Aravind

Updated On : November 5, 2024 / 4:33 PM IST

Thandel : నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కుతుంది తండేల్. శ్రీకాకుళంలోని కొంతమంది మత్స్యకారుల జీవితకథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తండేల్ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

అయితే తండేల్ సినిమా మొదట డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ షూటింగ్ కాకపోవడంతో ఈ సంక్రాంతికి వాయిదా వేసుకున్నారు. కానీ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు ఉండటంతో సంక్రాంతి బరి నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.

Also Read : Rana – Nani : బాబోయ్.. ఆ ఈవెంట్లో నానిని ఓ రేంజ్ లో పొగిడిన రానా.. మా జనరేషన్ లో గ్రేటెస్ట్ యాక్టర్ అంటూ..

తాజాగా నేడు తండేల్ ప్రెస్ మెట్ పెట్టి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. నిర్మాత అల్లు అరవింద్ తండేల్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ వీడియోలో తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుందని ప్రకటించారు. అలాగే ఈ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మేము డిసెంబర్ 20 కి వస్తామనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డేట్ కుదరలేదు. సంక్రాంతికి అసలు మేము అనుకోలేదు. సంక్రాంతికి వస్తుందని అందరూ అనుకున్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి. అక్కడ ఈక్వేషన్స్ వేరు. అందుకే కొత్త డేట్ తీసుకొచ్చాం అని తెలిపారు.