Rana – Nani : బాబోయ్.. ఆ ఈవెంట్లో నానిని ఓ రేంజ్ లో పొగిడిన రానా.. మా జనరేషన్ లో గ్రేటెస్ట్ యాక్టర్ అంటూ..
నానికి దసరా సినిమాకు గాను ఐఫా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. నాని అవార్డు అందుకున్నాక రానా మాట్లాడుతూ..

Rana Daggubati Praises Nani in IIFA Event Video goes Viral
Rana – Nani : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకొచ్చి స్టార్ హీరోగా ఎదిగిన వాళ్ళల్లో నాని ఒకరు, ఒకరకంగా చెప్పాలంటే చిరంజీవి, రవితేజ తర్వాత చాలా మందికి నానినే ఇన్స్పిరేషన్. నాని – రానా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చాలా క్లోజ్ కూడా. పబ్లిక్ ఈవెంట్స్ లో ఒకరిపై ఒకరు సెటైర్స్, జోక్స్ కూడా వేసుకుంటారు. అయితే తాజాగా ఓ ఈవెంట్లో రానా దగ్గుబాటి నానిని ఓ రేంజ్ లో పొగిడేసాడు.
ఇటీవల దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు నాని. దసరా, హాయ్ నాన్న సినిమాలకు వరుస అవార్డులు వచ్చాయి. సైమా, ఫిలింఫెర్, ఐఫా.. ఇలా అన్ని అవార్డులు వచ్చాయి. ఇటీవల అబూ దాబిలో ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్) ఈవెంట్ ఘనంగా చేసారు. దానికి సంబంధించిన ఈవెంట్ వీడియో తాజాగా రిలీజ్ చేసారు. దీంతో ఈ ఈవెంట్లోని హైలెట్స్ వైరల్ గా మారాయి..
Also Read : Chetan Krishna : తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదు.. థియేటర్స్ ఇవ్వడం లేదు.. ‘ధూం ధాం’ హీరో ఎమోషనల్..
నానికి దసరా సినిమాకు గాను ఐఫా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ ఈవెంట్ ని రానా, తేజ సజ్జ కలిసి హోస్ట్ చేసారు. నాని అవార్డు అందుకున్నాక రానా మాట్లాడుతూ.. మా జనరేషన్ లో ది గ్రేటెస్ట్ యాక్టర్ ఇక్కడ ఉన్నారు. బాలకృష్ణ గారి లాగే 50 ఇయర్స్ చేసుకుంటాడు. గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా నాని సాధిస్తాడు అని అన్నారు. దీంతో నాని ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. రానా ఓ రేంజ్ లో నాని ని పొగిడాడు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
Ma Generation lo The Greatest Actor
–#RanaDaggubati #Nani #IIFAUtsavam2024 pic.twitter.com/tno3qbwlu2— Bharath ᴴᴵᵀ ³ (@NameIsBharaath) November 4, 2024