Allu Aravind Reveals Interesting Secret about Naga Chaitanya and Sobhita
Allu Aravind : నాగచైతన్య త్వరలో తండేల్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తండేల్. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ముంబైలో తండేల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అమిర్ ఖాన్ గెస్ట్ గా వచ్చారు.
అయితే ఈ ఈవెంట్లో అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నాగచైతన్యకు ఇటీవలే పెళ్లి అయింది కొన్ని రోజుల క్రితమే. నేను పెళ్ళికి వెళ్లాను. కపుల్స్ ని ఆశిర్వదించాను. అప్పుడు చైతు వాళ్ళ వైఫ్ ని నాకు పరిచయం చేసాడు. ఆమె సర్ ఒక చిన్న రిక్వెస్ట్ అని అడిగింది. ఏంటి అని అంటే.. నా భర్త ఫేస్ ని నాకు ఎప్పుడు చూపిస్తారు? ఈ గడ్డం వల్ల నా భర్త ఫేస్ ని నేను చూడలేకపోతున్నాను అని చెప్పింది. సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే మీ ఆయన ఫేస్ చూడొచ్చు అని చెప్పాను అంటూ తెలిపారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ కొత్త థమ్సప్ యాడ్ చూశారా?
దీంతో అల్లు అరవింద్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తండేల్ సినిమా కోసం మొదటిసారి నాగచైతన్య ఫుల్ గా గడ్డం, జుట్టు పెంచిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ మ్యాన్లీ లుక్స్ తో హ్యాండ్సమ్ గా ఉండే చైతు ఈ సినిమా కోసం రఫ్ లుక్ లోకి మారిపోయాడు. అందుకే శోభిత పెళ్ళికి అల్లు అరవింద్ వస్తే ఇలా అడిగింది. దీనిబట్టి శోభితకి చైతు గడ్డంతో ఉంటే ఇష్టం లేనట్టు ఉంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య – శోభిత రెండేళ్లు ప్రేమించుకొని ఇటీవలే డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.