Allu Aravind : ఇండస్ట్రీలో కొత్తవాళ్లను తొక్కేయకూడదు.. సీనియర్స్ జూనియర్స్ కి అవకాశాలు ఇవ్వాలి.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు..

2018 సినిమాని ఇటీవల నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించి, మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించగా అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Allu Aravind : మలయాళం(Malayalam)లో సూపర్ హిట్ అయిన 2018 సినిమాని ఇటీవల నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించి, మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించగా అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ చందు మొండేటి(Chandoo Mondeti) కూడా వచ్చారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను నిర్మాతగా ఉంటూనే బన్నీవాసు లాంటి వాళ్ళని మరింతమందిని ఎంకరేజ్ చేస్తున్నాను. సినీ పరిశ్రమలో సీనియర్స్, మా జనరేషన్ జూనియర్స్ కి స్పేస్ ఇవ్వాలి. మొత్తం మేమే అనుకోకూడదు సీనియర్స్. డబ్బులు, పేరు మొత్తం మాకే అనుకోకూడదు. జూనియర్స్ కి స్పేస్ ఇస్తే పరిశ్రమ ఇంకా బాగుంటుంది. కొత్తవాళ్లను తొక్కేయకూడదు, సపోర్ట్ ఇవ్వాలి అని అన్నారు.

అలాగే.. చందు మొండేటితో గతంలోనే సినిమా అనుకున్నాం. కార్తికేయ 2 హిట్ అయిన తర్వాత కాదు, దానికంటే ముందే ఆయనతో సినిమా అనుకున్నాం. త్వరలో మా నిర్మాణంలో సినిమా ఉంటుంది. నేను పేరు చెప్పను కానీ ఇంకో దర్శకుడికి కూడా ఆఫర్ ఇచ్చాను, లేట్ అయింది కానీ అతను వెళ్ళిపోయాడు. చందు మాత్రం ఇప్పటికీ అదే మాట మీద నిలబడి మా నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు అని అన్నారు.

Guntur Kaaram : మహేష్ ‘గుంటూరు కారం’.. ఎన్టీఆర్ ‘రాఖీ’.. ఈ పోలిక చూశారా? రెండు సినిమాలకు..

ఇక బోయపాటి శ్రీను గురించి మాట్లాడుతూ.. బోయపాటితో మా సంస్థలో సినిమా ఉంది. ఇద్దరు హీరోలని అనుకుంటున్నాము. కథ రెడీ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు చేసే సినిమా అయ్యాక కచ్చితంగా మా సంస్థలో బోయపాటి సినిమా ఉంటుంది అని తెలిపారు. దీంతో సినీ పరిశ్రమలో సీనియర్స్, జూనియర్స్ అంటూ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు