Allu Arjun : సమ్మర్ లో వైజాగ్ కి ‘అల్లు అర్జున్’.. భారీగా AAA రెడీ అవుతుందిగా..
అల్లు అర్జున్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క పలు బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే.

Allu Arjun
Allu Arjun : అల్లు అర్జున్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క పలు బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. అందులో AAA మల్టిప్లెక్స్ థియేటర్స్ ఒకటి. హైదరాబాద్ లో ఆసియన్ గ్రూప్ తో కలిసి అల్లు అర్జున్ AAA మల్టిప్లెక్స్ కట్టగా అది బాగా రన్ అవుతుంది. దీంతో వైజాగ్ లో మరో మల్టీప్లెక్స్ ప్లాన్ చేసారు.
వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. ఇందులోనే AAA మల్టిప్లెక్స్ థియేటర్ రానుంది. తాజాగా నిన్న ఈ మల్టిప్లెక్స్ మొదలుపెట్టడానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆసియన్ గ్రూప్ సునీల్ నారంగ్, అతని ప్రతినిధులు, అల్లు అరవింద్ పాల్గొన్నారు.
Also Read : Sai Pallavi : వామ్మో.. ‘సీత’కి అన్ని కోట్ల రెమ్యునరేషన్.. సాయి పల్లవి దశ తిరిగిందిగా..
వచ్చే సమ్మర్ కి ఈ థియేటర్ ని రెడీ చేస్తారని, అల్లు అర్జున్ చేతుల మీదుగా దీన్ని గ్రాండ్ గా ఓపెన్ చేస్తారని తెలుస్తుంది. అంటే 2026 సమ్మర్లో అల్లు అర్జున్ మరోసారి వైజాగ్ కి వెళ్లనున్నారు. ఇక వైజాగ్ సినీ లవర్స్ ఈ మల్టీప్లెక్స్ కోసం, బన్నీ అభిమానులు ఆయన రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Renu Desai : రేణు దేశాయ్ కి సర్జరీ.. ఏం సర్జరీ జరిగింది?