Balakrishna – Allu Arjun : బాలయ్య అన్‌స్టాపబుల్ లో మరోసారి అల్లు అర్జున్.. గ్లింప్స్ కూడా రిలీజ్..

అల్లు అర్జున్ మరోసారి అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన గ్లింప్స్ ని సూర్య ఎపిసోడ్ ముందు ప్లే చేసారు.

Allu Arjun again went to Balakrishna Unstoppable Show AHA Gives Surprise to Fans

Balakrishna – Allu Arjun : ఆహా ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ రాగా తాజాగా నిన్నటి నుంచి మూడవ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ కి సూర్యతో పాటు బాబీ డియోల్, డైరెక్టర్ శివ వచ్చి సందడి చేసారు. అయితే ఈ ఎపిసోడ్ మొదట్లోనే బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.

Also Read : Varun Tej Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమా అతని బయోపిక్..?

అల్లు అర్జున్ మరోసారి అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన గ్లింప్స్ ని సూర్య ఎపిసోడ్ ముందు ప్లే చేసారు. అల్లు అర్జున్ రాగానే బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్ అనగా ఎలా అని బన్నీ అడిగితే నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పారు బాలయ్య. ఇక ఇద్దరూ కలిసి పుష్ప స్టెప్ వేసి సందడి చేసారు. ఈ గ్లింప్స్ విడిగా రిలిజ్ చేయకపోయినా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఆహా కూడా ఈ సర్ ప్రైజ్ ని అధికారికంగా ప్రకటించింది.

గతంలో పుష్ప సినిమా ప్రమోషన్స్ టైంలో అల్లు అర్జున్ బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసాడు. ఇప్పుడు మరోసారి పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ షోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ అవ్వగా ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేయడంతో ఈ ఎపిసోడ్ నెక్స్ట్ నాలుగవ ఎపిసోడ్ గా రిలీజ్ చేస్తారా లేదా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బాలయ్య – అల్లు అర్జున్ చేసే అల్లరి కోసం ఫ్యాన్స్ మరోసారి వెయిట్ చేస్తున్నారు.