Varun Tej Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమా అతని బయోపిక్..?

తాజాగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ దీనిపై స్పందించాడు.

Varun Tej Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమా అతని బయోపిక్..?

Matka Movie is a Mumbai Matka King Ratan Khatri Biopic Rumours Goes viral Varun Tej gives Clarity

Updated On : November 9, 2024 / 6:36 PM IST

Varun Tej Matka : వరుణ్ తేజ్ హీరోగా కరుణకుమార దర్శకత్వంలో రాబోతున్న సినిమా మట్కా. 1970 బ్యాక్ డ్రాప్ లో మట్కా అనే గేమ్ తో డాన్ గా ఎదిగిన ఓ వ్యక్తి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా నోరా ఫతేహి, నవీన్ చంద్ర.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వాసు అనే పాత్రలో యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ముసలి వాడి పాత్రల్లో కనిపించబోతున్నాడు.

అయితే మట్కా సినిమా ముంబైలో మట్కా కింగ్ రతన్ ఖత్రి బయోపిక్ అని తెలుస్తుంది. పాకిస్థాన్ నుంచి 1947లో దేశం విడిపోయినప్పుడు వలస వచ్చిన రతన్ ఖత్రి ఏమి లేని వాడి నుంచి మట్కా కింగ్ గా ఎదిగాడు. అతని కథతో ఆల్రెడీ బాలీవుడ్ లో మట్కా కింగ్ అనే సిరిస్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఆ సిరీస్ షూటింగ్ దశలో ఉంది. అయితే వరుణ్ తేజ్ మట్కా సినిమా రతన్ ఖత్రి బయోపిక్ అని అంటున్నారు.

Also Read : Game Changer Teaser : ‘గేమ్ ఛేంజర్’ టీజర్ వచ్చేసింది.. రామ్ చరణ్ అదరగొట్టాడుగా.. లుక్స్ మాత్రం వేరే లెవల్..

దీనిపై తాజాగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ స్పందించాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. రతన్ ఖత్రి కథను జస్ట్ పాయింట్ గా తీసుకొని మొత్తం ఇక్కడ తెలుగు నేటివిటీకి మార్చుకొని ఒక కొత్త కమర్షియల్ సినిమాలా తెరకెక్కించాము. ఇది బయోపిక్ అయితే కాదు. కేవలం అతని కథలోని మెయిన్ పాయింట్ ని తీసుకున్నాము అని తెలిపారు. బయోపిక్ కాదని చెప్పినా ఇది ముంబై మట్కా కింగ్ రతన్ ఖత్రి కథే అని తెలుస్తుంది.

మట్కా సినిమాలో వరుణ్ తేజ్ బర్మా నుంచి వలస వచ్చినట్టు, వైజాగ్ లో సెటిల్ అయి మట్కా కింగ్ గా ఎదిగినట్టు చూపించబోతున్నారట. ఫుల్ మాస్ కమర్షియల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ కి మట్కా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.