Arjun – Akhil – Akira : ఈ ముగ్గురు బర్త్ డేలు ఇవాళే అని తెలుసా? ముగ్గురు A తోనే మొదలు..

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్, అఖిల్, అకిరా నందన్.. ఈ ముగ్గురి పేర్లు A తోనే మొదలవ్వడం గమనార్హం.

Allu Arjun Akhil Akkineni Akira Nandan Birthdays Celebrating Today

Arjun – Akhil – Akira : సాధారణంగా పలువురు సెలబ్రిటీల బర్త్ డేలు ఒకే రోజు వస్తుంటాయి. అలా ఇవాళ కూడా మనకి బాగా తెలిసిన సెలబ్రిటీల స్టార్స్ పుట్టిన రోజులు ఒకే రోజు వచ్చాయి. ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుట్టిన రోజు అని అందరికి తెలిసిందే. పుష్పతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకొని, నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న అల్లు అర్జున్ నేడు తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అభిమానులైతే బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

అలాగే నేడు అఖిల్ పుట్టిన రోజు కూడా. నాగార్జున కొడుకుగా సినీ పరిశ్రమకి పరిచమైన అఖిల్ ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులని పలకరించాడు. కానీ హీరోగా నిలబడే రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సంవత్సరం బర్త్ డే తర్వాత రాబోయే సినిమా అఖిల్ కి మంచి హిట్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక అక్కినేని అభిమానులు అఖిల్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Dil Raju : మళ్ళీ పాత రోజులని తీసుకొస్తున్న దిల్ రాజు.. ఘనంగా ఆడియో లాంచ్ ఈవెంట్.. ఆ సినిమాతోనే మొదలు..

వీరిద్దరితో పాటు నేడు పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్(Akira Nandan) కూడా నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అకిరా హీరోగా సినిమాల్లోకి రాడు అని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ పవన్ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ అకిరా నందన్ గురించి మాట్లాడతారు. ఇక సోషల్ మీడియాలో అకిరా ఫోటోలు షేర్ చేస్తూ విషెష్ తెలుపుతున్నారు పవన్ అభిమానులు. ప్రస్తుతం అకిరా అమెరికాలోని ఓ యూనివర్సిటీలో మ్యూజిక్ నేర్చుకుంటున్నట్టు సమాచారం. అకిరా ఇప్పటికే తన మ్యూజిక్ తో మెప్పిస్తున్నాడు, త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది.

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్, అఖిల్, అకిరా నందన్.. ఈ ముగ్గురి పేర్లు A తోనే మొదలవ్వడం గమనార్హం. ప్రముఖ పాటల రచయిత అనంత్ శ్రీరామ్ పుట్టిన రోజు కూడా ఇవాళే కావడం గమనార్హం. అయితే వీరితో పాటు హీరోయిన్ నిత్య మీనన్ కూడా ఇవాళే పుట్టిన రోజు జరుపుకుంటుంది.