Allu Arjun : ‘ఆర్య’ రీ యూనియన్‌ సెలబ్రేషన్స్‌తో పాటు రీ రిలీజ్ ప్లాన్..

'ఆర్య' రీ యూనియన్‌ సెలబ్రేషన్స్‌తో పాటు రీ రిలీజ్ ని కూడా ప్లాన్ చేసిన దిల్ రాజు.

Allu Arjun Arya re unioun and re release update

Allu Arjun : ఐకానిక్ కాంబినేషన్ అల్లు అర్జున్, సుకుమార్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్య సినిమాతో ఈ కాంబినేషన్ మొదలయింది. 2004లో దిల్ రాజు నిర్మాణంలో రెండో సినిమాగా, సుకుమార్ మొదటి మూవీగా, అల్లు అర్జున్ నటించిన రెండో చిత్రంగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఫీల్ మై లవ్ అంటూ సరికొత్త లవ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ ఏడాది మే 7తో ఈ సినిమా రిలీజయ్యి 20ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఈ మూవీ కోసం పని చేసిన దిల్ రాజు, సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. దీంతో దిల్ రాజు ఈ 20 ఇయర్స్ ని ఓ రీ యూనియన్ ఈవెంట్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు.

Also read : Game Changer : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు.. అలాగే రిలీజ్ డేట్ గురించి..

ఈ విషయం గురించి సుకుమార్ అండ్ అల్లు అర్జున్ తో కూడా మాట్లాడరంట. మే 7న ‘ఆర్య’ రీ యూనియన్‌ సెలబ్రేషన్స్‌ జరగనున్నాయి. ఇక ఈ రీ యూనియన్‌ తో పాటు మూవీని రీ రిలీజ్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే.. ఈ సినిమాని రీ రిలీజ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారట. బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కలిసి ‘ఆర్య 2’తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే ఆ సీక్వెల్ ప్రేక్షకులను మొదటి మూవీని మించి ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం తరువాత పుష్ప సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులంతా పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆగష్టులో థియేటర్స్ లోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు