Game Changer : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు.. అలాగే రిలీజ్ డేట్ గురించి..
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు. భారీ కలెక్షన్స్ నమోదు చేయడానికి..

Dil raju gave good news to Ram Charan Fans about Game Changer
Game Changer : దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా తమిళ్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడం, దర్శకుడు శంకర్ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ ఇటీవల ‘జరగండి’ పాటని కేవలం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే రిలీజ్ చేయడంతో.. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రావడం లేదా అనే సందేహం మొదలయింది. ఇక ఈ విషయానే దిల్ రాజు ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుందని, సౌత్ నాలుగు లాంగ్వేజ్స్ అండ్ హిందీలో ఈ మూవీ రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.
Also read : Nani : దసరా కాంబినేషన్ ఈజ్ బ్యాక్.. పోస్టర్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసిన నాని..
ఇక ఈ కామెంట్స్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. ఎందుకంటే, ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయితే భారీ కలెక్షన్స్ ని నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు దిల్ రాజు చేసిన కామెంట్స్ చరణ్ ఫ్యాన్స్ ఖుషి చేస్తున్నాయి. అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అని ప్రశ్నించగా.. డేట్ ఫిక్స్ అయ్యిందని, దర్శకుడు శంకర్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని పేర్కొన్నారు.
Producer #DilRaju Confirms #GameChanger Releases in all 5 Languages ? and Release Date is also Locked ? and will be announced Soon by director @shankarshanmugh !!?@AlwaysRamCharan pic.twitter.com/f6Ubu5YvkB
— Navya (@HoneYNavya_) March 30, 2024
కాగా ఈ సినిమాని దివాళీ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేసుకున్నారట. త్వరలోనే ఈ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.